ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

గాయాలైన ఆటో డ్రైవర్‌

పాలకొల్లులో ఢీకొన్న ఆటో, ఆర్టీసీ బస్సు

పాలకొల్లు సెంట్రల్‌: ఆర్టీసీ బస్సు లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఆటోను ఢీకొట్టిన సంఘటనలో ఆటో డ్రైవర్‌ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. బుధవారం రాత్రి పాలకొల్లు–నరసాపురం రోడ్డులో అయ్యప్పస్వామి ఆలయం దాటిన అనంతరం పాలకొల్లు నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ నరసాపురం నుంచి భీమవరం వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు క్షతగాత్రుడిని 108 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement