వరదలతో ఇసుక కొరత రాకుండా సంబంధిత యంత్రాంగం ముందుగానే స్టాక్‌లు సిద్ధం చేయా లి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో ఏడు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి ఒక్కోచోట 70 వేల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని నిర్ణయించారు. అయితే ఆచంట స్టాక్ పాయింట్‌లో 20,100, భీమవరంలో 6,240, నరసాపురంలో 2,450, పాలకొల్లులో 19,555, తాడేపల్లిగూడెంలో 35,180, తణుకులో 7,878, ఉండిలో 28,990 మొత్తంగా 1.20 లక్షల టన్నులు మాత్రమే నిల్వ చేశారు. టన్ను రూ.306ల నుంచి రూ.581లు ధర నిర్ణయించారు. లోడింగ్, జీఎస్‌టీ చార్జీలు అదనం. ఇక్కడి ధరలతో పోలిస్తే కూటమి నేతల అనధికార స్టాక్ పాయింట్లలో తక్కువకే ఇసుక లోడింగ్ చేసి రూ.కోట్లల్లో సొమ్ము చేసుకున్నారు. ఉదాహరణకు తాడేపల్లిగూడెంలోని స్టాక్ పాయింట్‌లో 20 టన్నులు లోడింగ్‌కు అప్పట్లో రూ.12 వే లు వసూలు చేస్తే సిద్దాంతం దగ్గర టీడీపీ నేత అ నధికార స్టాక్ పాయింట్‌లో రూ.8 వేలకే లోడింగ్ చేసేవారు. స్టాక్ పాయింట్లలో అధిక ధరలు నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం పరోక్షంగా కూటమి నేతలకు రూ.కోట్లల్లో మేలు చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. పాత స్టాకులు మిగిలిపోవడంతో ఈ ఏడాది కొత్తగా స్టాకు పెట్టని పరిస్థితి.


