రోత వ్యాఖ్యలపై ప్రజాగ్రహం | - | Sakshi
Sakshi News home page

రోత వ్యాఖ్యలపై ప్రజాగ్రహం

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

శాశ్వత భవనం లేని కలెక్టరేట్‌ గ్రామ స్వరాజ్యానికి తూట్లు

న్యూస్‌రీల్‌

రాధాకృష్ణా.. సిగ్గుసిగ్గు

శాశ్వత భవనం లేని కలెక్టరేట్‌
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్‌ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు శాశ్వత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతోంది. 8లో u

వైఎస్సార్‌ సీపీ హయాంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్లుగా మార్చి గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. 8లో u

శురకవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నీచమైన రాతలతో రాక్షాసానందం పొందే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు గట్టిగా బుద్ధి చెబుతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తలు హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులను రోత పదజాలంతో మాట్లాడడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు వెల్లువెత్తాయి. అదే విధంగా అనేక మండలాల్లో పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరంగా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తణుకులో బుధవారం జిల్లాస్థాయిలో ఆందోళనలు నిర్వహించగా గురువారం పోలవరం, నూజివీడు, ఉండి, భీమవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, పోలీసు ఫిర్యాదులు చేశారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో..

ఏబీఎన్‌ రాధాకృష్ణ్ణపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వడ్డి రఘురామ్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్‌ నాయుడు మాట్లాడుతూ రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్‌ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

భీమవరం నియోజకవర్గంలో..

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై గురువారం భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా చినమిల్లి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ మహిళా పక్షపాతిగానే ఉంటూ, మహిళలకు పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. మహిళల పట్ల ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీలోని నాయకులు, కార్యకర్తల భార్యల గురించి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలను చేసిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఉండి నియోజకవర్గంలో..

ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్‌ నుంచి ఉండి పోలీస్‌ స్టేషన్‌ వరకూ పార్టీ శ్రేణులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్‌ మాట్లాడుతూ పార్టీకి అహర్నిశలు పాటుడుడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల భార్యలపై చేసిన మురికి వ్యాఖ్యలకు రాధాకృష్ణ సిగ్గుపడాలన్నారు. రాజకీయాల్లో మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. నీచమైన మాటలకు క్ష మాపణ చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం ఉండి స్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి ఎస్సై ఎండీ నసీరుల్లాకు ఫిర్యాదు చేశారు.

పాలకొల్లు నియోజకవర్గంలో..

కలానికే కళంకం తీసుకువచ్చిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ిసీఐ కోలా రజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో ఏది రాసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో మహిళలను కించపరుస్తూ కథనాలు రాసి పైశాచికానందం పొందుతున్న రాధాకృష్ణ నిరంకుశత్వ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మహిళలపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నాయని ఆందోళన చెందారు. రాధాకృష్ణ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నూజివీడు నియోజకవర్గంలో..

నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు నేతృత్వంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గౌవరమైన జర్నలిజం వృత్తిలో మహిళలను కించపరచడంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. తక్షణమే రాధాకృష్ణ చేయించిన రోత వ్యాఖ్యలపై మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం నియోజకవర్గంలో..

పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుట్టాయగూడెం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు కార్యకర్తల భార్యలపై సైతం వ్యాఖ్యలు చేయించడం రాధాకృష్ణ మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు. ఇటువంటి చర్యలను సభ్యసమాజం ఏనాడు స్వాగతించదని, రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో గురువారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కొయ్యలగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. చేబ్రోలు బస్టాండ్‌ సెంటర్‌ల నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై సూర్యభగవాన్‌కు ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే నరసాపురం, ఆచంటలోని పోలీస్‌స్టేషన్లలో స్థానిక నాయకులు ఫిర్యాదులు చేశారు.

చెత్త పలుకుకు ఛీత్కారం

నీచానికి పరాకాష్టగా పిచ్చి రాతలు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, ఫిర్యాదులు

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఆత్మగౌరవం కించపరిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిక

ఉమ్మడి పశ్చిమలో వెల్లువెత్తిన నిరసనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement