పేకాటలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌ | - | Sakshi
Sakshi News home page

పేకాటలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

గతనెల 28న భీమడోలులో పేకాట శిబిరంలో గన్‌మెన్‌ అరెస్ట్‌

పదిరోజుల తరువాత ఇప్పుడు సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు

ఈ పదిరోజులు ఎమ్మెల్యే బడేటి వెంటే గన్‌మెన్‌

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గన్‌మెన్‌ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేశారు. పదిరోజుల తరువాత సోమవారం అతడిని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా పోలీసుశాఖలో సిబ్బంది ఏదైనా తప్పు చేసినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా వెంటనే వీఆర్‌కు పంపడం లేదా విచారణ నిర్వహించి సస్పెండ్‌ చేయడం సర్వసాధారణం. కానీ ఈ కానిస్టేబుల్‌ విషయంలో మాత్రం పదిరోజులు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. గతనెల 28న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గన్‌మెన్‌ శనపతి శ్రీఆంజనేయులు భీమడోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ పేకాట శిబిరంలో పేకాడుతూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. అతడితో సహా ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గన్‌మెన్‌కు భీమడోలు పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. శాఖాపరమైన విషయం కావడంతో ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఎస్పీ కూడా చర్యలేమీ తీసుకోలేదు. అప్పటినుంచి గన్‌మెన్‌ ఎమ్మెల్యే వెంట అన్ని కార్యక్రమాల్లో భద్రత నిమిత్తం పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం చొదిమెళ్లలో జరిగిన సాగునీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంట ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ ఆంజనేయులును సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement