వేగంగా జాతీయ రహదారి పనులు
మొదటి విడత ప్యాకేజీ పనులు ఇలా ..
రహదారి ఏర్పాటు ఆనందంగా ఉంది
వైఎస్సార్ సీపీ పాలనలోనే పనులు
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం జీలుగుమిల్లి– పట్టిసీమ జాతీయ రహదారి 365 బీబీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులు పూర్తి కావడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, ఇప్పలపాడు , కంసాలికుంట మీదగా పద్మవారిగూడెం సమీపంలో నిర్మాణంలో ఉన్న మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వరకూ బైపాస్ నిర్మాణాల పనులను చేస్తున్నారు. అలాగే ఆయా పనులు జరిగే ప్రాంతంలో ఉన్న కాలువలపై కల్వర్టులు, వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా గిరిజన గ్రామాలను కలుపుకుని నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రహదారి నిర్మాణానికి సంబంధించి రోడ్డు వెడల్పు పనులు చేయడంతో గ్రామాల స్వరూపం కూడా మారిపోయాయి.
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే...
సూర్యపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదగా దేవరపల్లి జాతీయ రహదారికి కనెక్టివిటీ పెంచేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు జరిగాయి. దీనితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణానికికు వైఎస్సార్‌సీపీ పాలనలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. సూర్యపేట నుంచి కుసుమంచి, వైరా, తల్లాడ, సత్తుపల్లి, ఆశ్వారావుపేట మీదగా ఆంధ్రప్రదేశ్‌లోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదగా పోలవరం సమీపంలో ఉన్న పట్టిసీమ వరకూ రహదారి కలుపుతూ డిజైన్ చేశారు.
2023లోనే ప్రారంభం
జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకూ మొత్తం 86.5 కిలోమీటర్లు మేర రహదారి ఉంది. ఈ హైవే 365 బీబీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 369 కోట్లు మంజూరు చేసింది. అయితే వైఎస్సార్‌సీపీ పాలన సమయంలోనే సుమారు రూ. 32 కోట్ల వ్యయంతో జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకూ సుమారు 86 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేశారు. జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం వరకూ రూ. 5 కోట్లు, బుట్టాయగూడెం నుంచి కన్నాపురం వరకూ రూ. 7 కోట్లు, కన్నాపురం నుంచి ఎల్‌ఎన్‌డిపేట వరకూ రూ. 3 కోట్లు, ఎల్‌ఎన్‌డీ పేట నుంచి పట్టిసీమ వరకూ రూ. 4 కోట్లు, పట్టిసీమ నుంచి కొవ్వూరు వరకూ రూ. 13 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు. అయితే నాలుగు రోడ్లుగా విస్తరణ, భూసేకరణకు సంబంధించి కూడా అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 2023 డిసెంబర్ 28న శంకుస్థాపన చేశారు. జిల్లా అధికారులు భూసేకరణ పనులు పూర్తి చేసి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేయడంతో వేగవంతంగా జరుగుతున్నాయి.
చేపట్టనున్న నిర్మాణాలు
చిన్న వంతెనలు – 5
కల్వర్టులు – 30
రెండో ప్యాకేజీలో 46 కిలోమీటర్లు
భూసేకరణకు కేటాయించిన
నిధులు రూ.50 కోట్లు
జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మీదుగా
బుట్టాయగూడెం శివారు మల్టీ స్పెషాలీటీ ఆస్పత్రి వరకూ 26 కిలో మీటర్లు..
ఎల్‌ఎన్డీ పేట బైపాస్ నుంచి
పట్టిసీమ సాయిబాబా గుడి వరకూ నిర్మాణం
ఎన్‌హెచ్ 365 బీబీ రోడ్డు
పనుల వివరాలు
మొదటి విడత పనులు – 40.4 కిలో మీటర్లు
మంజూరైన నిధులు – రూ. 369 కోట్లు
భూసేకరణకు కేటాయించిన
నిధులు – రూ. 25.6 కోట్లు
ఏజెన్సీ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పాటు ఆనందంగా ఉంది. ఈ పనులు పూర్తయితే రాజమండ్రి ప్రయాణం సులభతరంగా మారుతుంది. అలాగే బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల రైతులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పాటవుతుందని కలలో కూడా ఊహించలేదు.
– తెల్లం దేవరాజు, గిరిజన రైతు, కంసాలికుంట
వైఎస్సార్ సీపీ పాలనలో జీలుగుమిల్లి, పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకూ నేషనల్ హైవే పనులు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు రూ. 32 కోట్లతో జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా సుమారు 86 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాం. తదుపరి నాలుగు లైన్ల పనులకు కూడా చర్యలు తీసుకున్నాం. రోడ్డు విస్తరణకు, రెండవ దశ పనులకు శంకుస్థాపన చేశాం. ఎన్నికలు, భూసేకరణ నేపద్యంలో పనులు నిలిచాయి.
– తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు
జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మీదుగా పట్టిసీమ వరకు
జాతీయ రహదారి నిర్మాణం
రూ.369 కోట్లతో40 కిలో మీటర్ల పరిధిలో ఎన్‌హెచ్ 365 బీబీ పనులు
వైఎస్సార్ సీపీ పాలనలోనే పనుల ప్రారంభం
వేగంగా జాతీయ రహదారి పనులు
వేగంగా జాతీయ రహదారి పనులు
వేగంగా జాతీయ రహదారి పనులు


