నైపుణ్యంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలి
నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్‌వీ రమణరావు
తాడేపల్లిగూడెం: నైపుణ్యాలను సాంకేతిక పరిజ్ఞానానికి జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.రమణరావు అన్నారు. మంగళవారం నిట్‌లో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈఎస్‌డీపీ ర్యాంపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా రమణరావు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో యువత పాత్ర కీలకమన్నారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ , స్కిల్ డెవలప్‌మెంటు ప్రోగ్రామ్‌లు విద్యార్థుల్లో ఇన్నోవేషన్, స్టార్టప్, స్వయం ఉపాధి ధృక్పథాన్ని పెంచుతాయన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థలో 83 ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్, కౌన్సిల్ కార్యక్రమాలు, 35 ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో రీసెర్చ్,కన్సల్టెన్సీ ద్వారా పది స్టార్టప్‌లను ప్రోత్సహించామన్నారు. ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ కన్సల్టెన్సీ జి.రవికిరణ్ శాస్త్రి మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానం, స్వదేశీ సాంకేతికతలు, బ్రహ్మోస్ కీలక ప్రాజెక్టుల గురించి ఉదహరించారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ట్రైనింగ్ హెడ్ కె.మురళీకృష్ణ, నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డాక్టర్ కార్తికేయశర్మ, ఆచార్యులు సంతోష్ కుమార్, పి.శంకర్, రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


