స్నేహితుడే కాలయముడై..
భీమడోలు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రాణం పోస్తాడనుకున్న స్నేహితుడే ప్రాణం తీసి కాలయుముడయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్జు రమేష్‌ను అదే గ్రామానికి కర్రి కొండ కుంకుళ్ల తులసీ శ్రీను అలియాస్ కర్రి శ్రీను సోమవారం రాత్రి హతమార్చాడు. అయితే వెజ్జు రమేష్, కర్రి శ్రీనులు ప్రాణ స్నేహితులు కావడం గమనార్హం. వెజ్జు రమేష్ వ్యవసాయ పనులకు, కర్రి శ్రీను కూలీ పనులకు వెళ్తుంటారు. వారిద్దరు చెడు వ్యసనాలకు బానిసలై ఒకరి వద్ద మరొకరు అప్పులు చేస్తూ జూలాయిలుగా తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం కర్రి శ్రీను తన స్నేహితుడు వెజ్జు రమేష్‌ను నమ్మించి కారులో తీసుకుని వెళ్లాడు. రాత్రి మద్యం సేవించిన రమేష్‌తో డబ్బులు విషయంలో కర్రి శ్రీను గొడవ పడ్డాడు. కోపోద్రిక్తుడైన కర్రి శ్రీను స్నేహితుడు వెజ్జు రమేష్‌ను విచక్షణారహితంగా రాడ్డుతో చితకబాదాడు. దీంతో రమేష్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. అక్కడ నుంచి కర్రి శ్రీను తాను హత్యకు వాడిన రాడ్డును దూరంగా విసిరేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కారుపై రక్తపు మరకలు పడ్డాయి. అయితే ముందుగా వెజ్జు రమేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడనుకుని కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వచ్చారు. భీమడోల సీఐ యూజే విల్సన్, ఎస్సై ఎస్‌కే మదీనా బాషాలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, అనుమానం రావడంతో పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సాంకేతిక బృందాలతో ఆ ప్రాంతంలో వెతగ్గా హత్యకు వాడిన రాడ్డు లభ్యమైనట్లు సమాచారం. అనంతరం వెజ్జు రమేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు సీఐ యూజే విల్సన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగిరిపల్లి: మామిడికాయలకు ఫ్రూట్ కవర్లు తొడగడం వలన అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన శాఖ అధికారి ఆర్. హేమ సూచించారు. మండలంలోని వడ్లమాను, కల్లుటూరు గ్రామాల్లోని మామిడి తోటలను మంగళవారం ఆమె పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మామిడి రైతులకు ఎకరానికిరూ.8500 రాయితీతో 6000 కవర్లు అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని మామిడి రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.
స్నేహితుడే కాలయముడై..
స్నేహితుడే కాలయముడై..
స్నేహితుడే కాలయముడై..


