జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక

Dec 18 2025 7:18 AM | Updated on Dec 18 2025 7:18 AM

జాతీయ

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక భీమవరంలో ‘మోగ్లీ’ సందడి ఆరుగొలనులో విషాదం గాంధీజీ పేరు తొలగింపు తగదు సారా స్థావరాలపై దాడి

భీమవరం: కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించే 69వ జాతీయస్థాయి అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ నిర్మల్‌ పోటీలకు రాష్ట్ర జట్టుకు భీమవరం బ్రౌనింగ్‌ కళాశాల విద్యార్థినులు జి లిఖిత, ఎన్‌ వర్షితలక్ష్మీ భద్ర ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ కె నవీన్‌ కుమార్‌ బుధవారం తెలిపారు. ఈనెల 24 నుంచి ఆరు రోజులపాటు జరగనున్న నెట్‌ బాల్‌ అండర్‌–19 జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను చర్చ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ విద్యాసంస్థల అధ్యక్ష, కార్యదర్శులు మేడిది జాన్సన్‌, మేడిది ఎస్తేరు ప్రియాంక అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ దావూద్‌ ఖాన్‌, విద్యాసంస్థల వైస్‌ ప్రెసిడెంట్‌ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: భీమవరం పట్టణంలోని ఏవీజీ సినిమాస్‌లో బుధవారం మోగ్లీ చిత్ర యూనిట్‌ సందడి చేసింది. నటీనటులు రోషన్‌ కనకాల, సాక్షి మండోల్కర్‌, హర్ష ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోషన్‌, సాక్షి మాట్లాడుతూ మూడు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముందుగా చిత్రబృందం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నివాసానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు.

కుక్క దాడిలో

చిన్నారికి గాయాలు

జంగారెడ్డిగూడెం: కుక్క దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక శిఖామణి చర్చి సమీపంలో సాయిబాబ, పూర్ణిమ దంపతులు నివసిస్తున్నారు. వీరు బుధవారం పశువుల ఆసుపత్రి సమీపంలో ఉన్న చర్చి వద్ద ప్రేయర్‌ చేసుకుంటున్నారు. వారి మూడేళ్ల చిన్నారి శ్రీహరిత బయట ఆడుకుంటుండగా, ఆమైపె కుక్క దాడిచేసింది. దీంతో శ్రీహరిత ముఖంపై కంటి భాగంలోను తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారి కేకలు విని బయటకు వచ్చి కుక్క దాడి నుంచి కాపాడారు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించారు.

ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి

తాడేపల్లిగూడెం రూరల్‌: ఆరుగొలను గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యభర్తలు రోజు వ్యవధిలోనే మృతి చెందారు. గ్రామానికి చెందిన మలకా అబద్దం – లక్ష్మి భార్యాభర్తలు. రెండ్రోజుల క్రితం భర్త అబద్దం బాత్‌ రూమ్‌లో పడిపోవడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు. తదుపరి అతని భార్య లక్ష్మి సైతం అనారోగ్యంతో తణుకు ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం మలకా అబద్దం (75) మృతి చెందగా, అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అతని భార్య లక్ష్మి (65) ఇంటి వద్ద తనువు చాలించింది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వీరికి వివాహమైన ఒక కుమార్తె ఉంది. రోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది.

భీమవరం: జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించడం జాతిపితను అవమానించడమేనని గాంధీ స్మారక నిధి జిల్లా ప్రతినిధి ఇందుకూరి ప్రసాదరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం గాంధేయవాదులు, గ్రామాభివృద్ధికి తోడ్పడే దాతలు, స్వచ్ఛంద సంస్థలకు ఆమోదయోగ్యం కాదని దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రసాదరాజు కోరారు.

చింతలపూడి: ఎరగ్రుంటపల్లి అడవి ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై చింతలపూడి పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన కటారి కోటేశ్వరరావు, గొల్ల మంగరావు, వనం కొండలరావులను అదుపులోకి తీసుకుని, 40 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్‌ కుమార్‌ తెలిపారు. 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక 1
1/3

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక 2
2/3

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక 3
3/3

జాతీయస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement