శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న జరగనున్న చినవెంకన్న ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ వెనుక చేపట్టిన తాత్కాలిక క్యూలైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ క్యూలైన్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ బుధవారం భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.


