పశువుల సంచారం.. ప్రాణ సంకటం | - | Sakshi
Sakshi News home page

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

Dec 18 2025 7:18 AM | Updated on Dec 18 2025 7:18 AM

పశువు

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

మూగజీవాలను బాధించడం తగదు

రోడ్లపైనే పశువులు

విచ్చలవిడిగా సంచరిస్తున్న మూగజీవాలు

నిత్యం ఏదో మూల వాహన ప్రమాదాలు

పట్టించుకోని ప్రభుత్వం

ఉండి: గోవులను పూజించడం మన ఆచారం. గృహప్రవేశాలకు సైతం మనిషికంటే ముందు గోమాత ఉండాలి. అలాంటి గోవుల సంరక్షణపై ఎవ్వరూ శ్రద్ధ వహించకపోవడం విచారకరం. ప్రభుత్వం సైతం పశువుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో పశువులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నాయి. వాటి వల్ల కూడా నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాల వల్ల పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి.

రోడ్లపైనే సంచారం..

నియోజకవర్గంలోని ఎన్నార్పీ అగ్రహారం నుంచి ఆకివీడు శివారు వరకు అలాగే కాళ్ల మండలం పెదఅమిరం మొదలుకొని జువ్వలపాలెం వరకు ఇలా ఎక్కడ చూసినా రోడ్లపై పదుల సంఖ్యలో ఆవులు దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 165తో పాటు పలు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో నడిరోడ్డుపైనే జీవిస్తున్నాయి. దీంతో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆవులను ఢీకొని పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా ప్రమాదాల్లో ఆవులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వాటిని ఆయా పంచాయతీల వారు ఖననం చేయడం తప్ప వాటిని తీసుకువచ్చి వదిలేసిన వారు గానీ, జంతు ప్రేమికులు గానీ పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి దారుణంగా ఉంది. మరికొన్ని గోవులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోవడంతో వాటిని చూసేందుకు కూడా భయపడేంత దారుణ పరిస్థితుల్లో గోవులు ఉంటున్నాయి. ఆహారం లభించక ప్లాస్టిక్‌ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయి.

పశువులకు హాస్టళ్లు ఎక్కడ?

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పశువులకు హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని గతంలో ఓమాట చెప్పి ఊరకున్నారే తప్ప.. పశువుల కోసం చేసిందేమీ లేదు. ఇప్పటికై నా పశువుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తే ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఉండే పశువులను, గోమాతలను హాస్టళ్లలో ఉంచి కనీసం కడుపునిండా మంచి ఆహారం పెట్టే అవకాశం ఉంటుందని పలువురు సేవాసంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉండే ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు ఏర్పాటు చేస్తే వాటికి నివాసస్థానమైనా ఏర్పడి ఎవరైనా వాటి ఆలనాపాలనా చూస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోవులను రోడ్లపై విడిచిపెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మూగజీవాలను బాధించడం మానవత్వం కాదు. పెంచుకోలేకపోతే మరెవ్వరికై నా అప్పగించాలే తప్ప ఇలా నడిరోడ్డుపై విడిచిపెట్టి అపచారం చేయకూడదు. లయన్స్‌క్లబ్‌, మానవత సేవాసంస్థ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు గోవులకు మేతపెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాతల సహకారం దొరికితే మరింతగా కార్యక్రమాన్ని చేడతాం.

– డాక్టర్‌ గాదిరాజు రంగరాజు, ఉండి మానవత సేవాసంస్థ అధ్యక్షుడు, చెరుకువాడ

ఉండి సెంటర్‌, బస్టాండ్‌, ఆకివీడు రోడ్డులో పదుల సంఖ్యలో గోవులు, పశువులు దర్శనమిస్తాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరగడంతో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల లారీ ఢీ కొట్టడంతో గాయపడిన అవు దూడకు వైద్యం చేయించి సాధారణ స్థితికి తీసుకువచ్చాను. గోసంరక్షకులు పశువులను పట్టించుకోవాలి.

– గుండాబత్తుల సుబ్బారావు, సీనియర్‌ రాజకీయవేత్త, ఉండి

పశువుల సంచారం.. ప్రాణ సంకటం 1
1/4

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

పశువుల సంచారం.. ప్రాణ సంకటం 2
2/4

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

పశువుల సంచారం.. ప్రాణ సంకటం 3
3/4

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

పశువుల సంచారం.. ప్రాణ సంకటం 4
4/4

పశువుల సంచారం.. ప్రాణ సంకటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement