బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్
ద్వారకాతిరుమల: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఎస్సై టి.సుధీర్ బుధవారం వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమలకు చెందిన పెద్దింటి రామ కిషోర్ ఈనెల 12న రాత్రి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న తన వెల్డింగ్ షాపు ముందు బైక్‌ను పార్క్ చేశాడు. అది చోరీకి గురవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్సై సుధీర్ భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా భీమడోలుకు చెందిన అడ్డాల ప్రవీణ్ కుమార్, పాగోలు శివ నాగు, భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన దోనాద్రి సాయి వంశీ ద్వారకాతిరుమల పోలీస్టేషన్ పరిధిలో 3 బైక్‌లు, ఏలూరు వన్‌టౌన్, దెందులూరు, పెదపాడు, చేబ్రోలు, నిడమర్రు, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీస్టేషన్ల పరిధిలో మరో 9 బైక్‌లు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి, రూ.9 లక్షలు విలువైన 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా దోనాద్రి వంశీపై భీమవరం పోలీస్‌స్టేషన్‌లో పలు కొట్లాట కేసులు, ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు నిర్ధారించారు. కేసు దర్యాప్తుకు సహకరించిన సీఐ విల్సన్, ఎస్సై సుధీర్, సిబ్బంది సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, వి.జయప్రకాష్ బాబులను డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు.
రూ.9 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం


