నిజమే.. మందులు రాలేదు
తణుకు అర్బన్: జిల్లాలోని పశువైద్యశాలల్లో పశువులకు అవసరమైన మందులు రెండు త్రైమాసికాలుగా సరఫరా లేకపోవడంతో పాడిరైతులు ప్రైవేటు మందులు వాడాల్సి వస్తుందంటూ ఈ నెల 15న ‘కాపాడితేనే మనుగడ’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ ఆర్.కోటిలింగరాజు స్పందించారు. జిల్లా పశువైద్యశాలలకు అవసరమైన ఇండెంట్‌ను పంపించామని మందులు జిల్లా కేంద్రానికి సరఫరా కాగానే కిందిస్థాయి ఆస్పత్రులకు పంపిస్తామని తెలిపారు.
నరసాపురం: నరసాపురం తీరప్రాంత గ్రామాల్లో విషపుటీగలు మళ్లీ పంజా విప్పుతున్నాయి. దీంతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బుధవారం నరసాపురం మండలం సారవలో తాటిచెట్ల ఆకుల మధ్య పెద్ద విషపుటీగల పుట్టలను గ్రామస్తులు గురించారు. రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏమాత్రం స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం తీరగ్రామాలైన వేములదీవి, తూర్పుతాళ్లు, పేరుపాలెం, కేపీపాలెం ప్రాంతాల్లో విషపుటీగలు భయపెట్టాయి. దాడిచేసి కుట్టడంతో గ్రామాలకు చెందిన 30 మంది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాపులతో ఇబ్బందులు పడ్డారు. విషపుటీగల భయం లేకుండా చర్యలు చేపట్టాలని తీర గ్రామాల వాసులు డిమాండ్ చేస్తున్నారు.
భీమవరం: జిల్లాలోని ఏడు పరీక్షాకేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షకు 81.69 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం సెంటర్లలో పరీక్షలు ఏర్పాటుచేయగా 1,480 మందికి 1,209 మంది హాజరయ్యారని ఎక్కడా అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
తాడేపల్లిగూడెం: పెన్షన్ అనేది యజమాని ఇష్టాయిష్టాలతో దయతో ఇచ్చే ధనం కాదని, అది స్థిరమైన హక్కు అని ఏపి సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయ భవనంలో బుధవారం జరిగిన జాతీయ పెన్షనర్ల నిర్వహించిన దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగి చేసిన సేవలను గుర్తించి ఇచ్చేదే పెన్షన్ అన్నారు. కార్యక్రమంలో ఎస్‌టీఓ దత్తేశ్వరరావు, తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, పెన్షనర్ల ఉద్యోగుల సంఘ అధ్యక్షులు బి.హరికుమార్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: రైతులకు ఉపకరించే పరిశోధనలు చేయాలని కొత్తగా ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉద్యాన వర్సిటీ ఇన్‌చార్జి వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు కోరారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట ఉద్యాన కళాశాలల్లో ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక్కడ బుధవారం కౌన్సిలింగ్ జరిగింది. ఐసీఏఆర్ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. 110 సీట్లకు కౌన్సెలింగ్ జరగగా 81 మంది చేరారు. మిగిలిన 29 సీట్లకు తదుపరి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
నిజమే.. మందులు రాలేదు
నిజమే.. మందులు రాలేదు


