బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 8లో u
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలో వేంచేసిన మావుళ్లమ్మ అమ్మవారి సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా గర్భాలయంలో శుద్ధి కార్యక్రమాలు, అలంకరణ పనుల నిమిత్తం మూలవిరాట్ దర్శనాలను నిలుపుదల చేశారు. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 28 వరకు నిలుపుదల చేసే క్రమంలో భాగంగాగా దేవస్థానం ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ, వేదపండితులు ఆధ్వర్యంలో విశేష హోమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటల సమయంలో పూజ జరిపి దర్శనాలు నిలుపుదల చేశారు. తిరిగి ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు కళాన్యాసము జరిపి అమ్మవారి మూలవిరాట్ పునఃదర్శనం ప్రారంభిస్తారని, ప్రదక్షణ మండపంలో గర్భాలయం వెనుక పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు.


