న్యూస్‌రీల్
మండలాల వారీగా పంటకు వాటిల్లిన నష్టం
తెలియక ప్రీమియం చెల్లించలేదు
మరోసారి సర్వే చేయాలి
‘వందే భారత్’ రాక ఎప్పుడో?
చైన్నె–విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పి నెల రోజులు గడిచినా ఇంతవరకూ పురోగతి లేదు 10లో u
కొల్లేరు వాసుల్లో పాముల భయం నెలకొంది. కై కలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది ఇంతవరకూ 188 పాము కాటు కేసులు నమోదయ్యాయి. 10లో u
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలోని ఖరీఫ్ పంటకు మోంథా కలిగించిన నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్ పూర్తిచేశారు. 20,174 మంది రైతులకు చెందిన 9,201 హెక్టార్లలో నష్టం జరిగినట్టు తేల్చారు. సోషల్ ఆడిట్ అనంతరం ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు. పంట నష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుందని రైతులు అంటున్నారు. జిల్లాలోని 2.15 లక్షల ఎకరాలలో(87,755 హెక్టార్ల) రైతులు ఖరీఫ్ సాగుచేశారు. సీజన్ ప్రాంరంభం నుంచి కర్షకులను కష్టాలు వెంటాడాయి. క్లోజర్ పనుల్లో జాప్యం, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ఎద్దడితో ఆచంట, పోడూరు, యలమంచిలి తదితర చోట్ల నారుమడులు ఎండిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆగస్టు మూడో వారంలో కురిసిన భారీ వర్షాలతో దాదాపు 32 వేల ఎకరాల్లో నాట్లు, పిలకల దశలో పంటకు నష్టం కలిగించాయి. యూరియా కొరతతో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని పలుచోట్ల రెండో కోటా వేసేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు.
చివరిలో.. పంట చివరి దశలో మోంథా తీవ్ర నష్టం కలిగించింది. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్‌లో కోతలు మొదలు కాగా 90 శాతం విస్తీర్ణంలో పంట చిరుపొట్ట, పూత, పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశల్లో ఉంది. ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 23 వేల వరకు పెట్టుబడులు పెట్టి కోతలు కోసేందుకు ఎదురుచూస్తున్నారు. నవంబరు రెండో వారం నుంచి జిల్లా అంతటా వరి కోతలు మొదలుకానున్నాయి. ఈ తరుణంలో గత నెల చివరిలో వచ్చిన మోంథా ప్రభావంతో జిల్లా అంతటా ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో వరిపంట నేలకొరిగింది. రోజుల తరబడి పొలాల్లోని ముంపు నీరు బయటకు లాగక పొట్టలు కుళ్లిపోయి ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజల శాతం పెరిగింది. 4207 హెక్టార్లలోని పంట నీట మునగ్గా, 6560 హెక్టార్లలోని పంట నేల వాలినట్టు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది.
9201 హెక్టార్లలో నష్టం
క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం జిల్లాలోని 9201 (సుమారు 23002 ఎకరాలు) హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్క తేల్చారు. ఇంతవరకు ఎకరాకు దాదాపు రూ.23 వేల వరకు రైతులు పెట్టిన పెట్టుబడిని బట్టి రూ.52.9 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రాథమిక అంచనా కంటే తుది నష్టం భారీగా తగ్గింది. అధికారిక లెక్కలు ప్రకారం అత్యధికంగా నరసాపురంలో 2,722 మంది రైతులకు చెందిన 1281 హెక్టార్లు, పెంటపాడులో 2,230 మంది రైతులకు చెందిన 1078 హెక్టార్లలో నష్టం జరిగింది. తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, వీరవాసరం మండలాల్లో 500 హెక్టార్లకు పైగా, ఆకివీడులో 464 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. గ్రామ సభల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. అధికారులు గుర్తించిన మేరకు హెక్టారుకు రూ.25,000 చొప్పున రూ.23 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇన్‌పుట్స్ సబ్సిడీగా ఇస్తుంది. పంట కోత ప్రయోగాల అనంతరం బీమా లెక్కిస్తారు. పంట నష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుందని రైతులు అంటున్నారు. పైరు నేలనంటడంతో వరికోత యంత్రాల ద్వారా కోయడం సాధ్యం కాదని, మనుషుల ద్వారా కోయిస్తే చాలా ఖర్చవుతుందంటున్నారు. 40 శాతం మేర దిగుబడి తగ్గిపోయి పంట పెట్టుబడులు కూడా రావని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
మండలం నష్టపోయిన పంట నష్టం
రైతులు (హెక్టార్లలో)
యలమంచిలి 881 337
గణపవరం 889 352
అత్తిలి 908 289
పెనుమంట్ర 739 342
తణుకు 1562 678
పోడూరు 629 267
పెంటపాడు 2,230 1,079
ఆచంట 595 246
నరసాపురం 2,722 1,282
ఆకివీడు 922 464
పాలకోడేరు 532 286
భీమవరం 1487 887
ఇరగరవం 860 388
తాడేపల్లిగూడెం 1,520 655
కాళ్ల 756 356
మొగల్తూరు 382 132
వీరవాసరం 965 522
పాలకొల్లు 944 358
పెనుగొండ 326 130
ఉండి 325 151
1.5 ఎకరం కౌలుకు చేస్తున్నాను. ఈ సార్వాలో స్వర్ణ సాగు చేశాను. నారుమడి, నాట్లు, ఎరువులు, పురుగు మందుల కోసం ఇప్పటికే రూ.35 వేల వరకు పెట్టుబడికి ఖర్చయ్యాయి. మరో రెండు వారాల్లో పంట చేతికొస్తుందనుకుంటే ఈలోగా తుపాను వచ్చి మొత్తం తుడిసిపెట్టేసింది. వెన్నులు కుళ్లిపోయి ధాన్యం తాలుగింజలుగా మారుతున్నాయి. బీమా గడువు తెలీక ప్రీమియం కట్టలేదు. ఇప్పుడేమో ప్రీమియం కట్టిన వారికే పరిహారం వస్తుందని చెబుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. బీమాతో సంబంధం లేకుండా పూర్తి నష్టపరిహారం చెల్లించాలి.
– పోలిశెట్టి కృష్ణ. వీరవాసరం
ఎన్యుమరేషన్‌పై రైతులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. పెంటపాడు మండలంలో 21 వేల ఎకరాలకుగాను సగంపైనే పంట నేలకు ఒరిగిపోగా 3 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ విషయంపై ఎన్యుమరేషన్ అధికారులు మరో మారు సర్వే చేయాలని రైతులు కోరుకుంటున్నారు.
– దేవరశెట్టి రాంబాబు, కౌలు రైతు, కొండేపాడు
మోంథా పంట నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తి
జిల్లాలో 9,201 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు తేల్చిన అధికారులు
నష్టపోయిన రైతులు 20,174
నష్టం ఇంకా ఎక్కువే ఉంటుందంటున్న రైతులు
తాలు శాతం పెరిగి దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన
నష్టం తేల్చేశారు
నష్టం తేల్చేశారు
నష్టం తేల్చేశారు


