కూరగాయలు కొనలేం | - | Sakshi
Sakshi News home page

కూరగాయలు కొనలేం

Nov 4 2025 8:13 AM | Updated on Nov 4 2025 8:13 AM

కూరగా

కూరగాయలు కొనలేం

● ఎన్నడూ లేనంతగా.. పంట మొత్తం పోయింది

కూరగాయల ధరలు (సుమారుగా కిలోకు రూ.లలో)

దొండకాయలు దడ పుట్టిస్తుంటే.. బీర కాయలు బెంబేలెత్తిస్తున్నాయి.. వంకాయలు వణుకు పుట్టిస్తుంటే.. బెండ కాయలు బేజారెత్తిస్తున్నాయి.. ఆనబకాయ తానేమీ తక్కువ కాదంటోంది.. కూరగాయలు రకం ఏదైనా వారం రోజుల వ్యవధిలో ధర రెండు, మూడింతలు పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కార్తీకమాసంతో వినియోగం పెరగ్గా.. మోంథా తుపాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు.

మొన్నటివరకు రూ.50 పెడితే పావు కిలో చొప్పున మూడు, నాలుగు రకాల కూ రగాయలు వచ్చేవి. ఇప్పుడు ఒక్కో కూరగాయ పావు కిలో రూ.30 పైనే ఉన్నాయి. ఎ న్నడూ లేనంతగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. సామాన్యులు కొ నలేని పరిస్థితి ఉంది. ఆయిల్‌, పప్పుల ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి.

– కోరం లలిత, గృహిణి, గంగడుపాలెం

నరసాపురం రూరల్‌ పితాని మెరక గ్రామంలో 1.5 ఎకరాల్లో వంగ, బీర, ఆనబ, దో సకాయలు సాగు చేస్తున్నాం. తుపాను ధాటికి రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో దోస పాదు పూర్తిగా పోయింది. బీర, ఆనబ పాదుల్లో పిందెలు మాడిపోయాయి. వంగ పంట పూర్తిగా దెబ్బతింది. వీటిని తొలగించి మరలా కొత్త పంట వేసుకోవాలి.

– విజయ బాలచంద్ర, రైతు, నరసాపురం రూరల్‌, పశ్చిమగోదావరి

సాక్షి, భీమవరం : కార్తీకమాసంలో మాంసాహారం తగ్గి కూరగాయల వినియోగం పెరుగుతుంది. రోజూ కార్తీక దీపారాధన చేసే భక్తులతో పాటు ఎక్కడ చూసినా శివ, అయ్యప్ప, మావుళ్లమ్మ వారి మాలధారులే కనిపిస్తున్నారు. ఊరూరా ఆలయ కమిటీలు, భక్త బృందాలు, దాతలు ఉచిత అన్నప్రసాద శిబిరాలను ఏర్పాటుచేసి మాలధారులకు బిక్షను అందిస్తున్నారు. దీంతో వినియోగం పెరగడంతో కార్తీకమాసం ప్రారంభం నుంచి కూరగాయల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

5 వేల ఎకరాల్లో..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, పెనుగొండ, ఆచంట మండలాల్లోని గోదావరి లంక గ్రామాలు, కుక్కునూరు, వేలేరుపాడు, నూజివీడు, చింతలపూడి, ఆగిరిపల్లి తదితర ప్రాంతాల్లో 5 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయి. జిల్లాను ఆనుకుని ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని లంకలు, చాగల్నాడు మెట్ట భూముల్లో బీర, బెండ, దొండ, వంకాయ, కాకర, ఆనబ తదితర పంటలు సాగవుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఆయా పంటలు స్థానిక మార్కెట్‌లకు రావడంతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి అవుతుంటాయి.

ముంచేసిన మోంథా

ఇటీవల వచ్చిన మోంథా తుపాను కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంట పూత రాలిపోవడం, మొదళ్లలో నీరు నిలిచిపోయి, ఇవక అయిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నర సాపురం రూరల్‌, ఆచంట, యలమంచిలి మండలాల్లోని దాదాపు 480 ఎకరాల్లోని కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా, పంట నష్టం ఇంకా భారీగానే ఉంటుందని రైతులు అంటున్నారు.

భారీగా పెరిగిన ధరలు

పంటలు దెబ్బతిని వాటి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. బీర, బెండ, దొండ, వంగ తదితర రకాల కూరగాయలు కిలో రూ.80 పైనే పలుకుతుండగా చిక్కుళ్లు రూ.160కి చేరాయి. గతంలో రూ.15కు దొరికే ఆనబకాయ ధర మూడింతలు పెరగ్గా, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే బంగాళాదుంప, బీట్‌రూట్‌, క్యారెట్‌, క్యాబేజీ ధరలు రెండింతల వరకు పెరిగాయి. బయటి మార్కెట్‌లో ధరలు ఇలా ఉంటే తోపుడు బండ్లు, సైకిళ్లపై అమ్మకాలు చేసే వారి వద్ద ఈ ధరలు మరింత అధికంగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీస్థాయిలో ధరలు పెరగలేదని, కూరగాయల పంటలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రెండు, మూడు వారాల సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

దళారుల దోపిడీ

రైతుల నుంచి నేరుగా దళారులు టోకున కూ రగాయలు కొనుగోలు చేసి చిల్లర వర్తకులకు అధిక ధరలకు విక్రయిస్తుండటం ధరలు పెరుగుదలకు దారితీస్తోంది. రిటైల్‌ మార్కెట్‌కు చేరేసరికి కూరగాయలు కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు పెరిగిపోతున్నాయి. దళారుల బెడదను అరికట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

బె‘ధర’గొడుతున్నాయ్‌

కార్తీకమాసంతో పెరిగిన వినియోగం

పంటలపై మోంథా తుపాను ప్రభావం

కూరగాయల ధరలకు రెక్కలు

ఉమ్మడి పశ్చిమలో 5 వేల ఎకరాల్లో సాగు

రకం తుపానుకు ముందు ప్రస్తుతం

వంకాయ 30–40 100–120

బీరకాయ 40 80–100

బెండకాయ 25–30 80–90

దొండకాయ 40 60

పచ్చిమిర్చి 30 50–60

చిక్కుడు 60–80 140–160

క్యారెట్‌ 30 70

బీట్‌రూట్‌ 30 60–70

బంగాళాదుంప 20 30–40

ఆనబకాయ (ఒకటి) 15–20 50–60

కూరగాయలు కొనలేం 1
1/2

కూరగాయలు కొనలేం

కూరగాయలు కొనలేం 2
2/2

కూరగాయలు కొనలేం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement