గురుతర బాధ్యత.. సేవాతత్పరత | - | Sakshi
Sakshi News home page

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

Sep 5 2025 7:39 AM | Updated on Sep 5 2025 7:39 AM

గురుత

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

అంతా ఉపాధ్యాయులే.. ● ఆమె బోధన వినూత్నం

తండ్రి గుర్తుగా.. సేవకు చేదోడుగా..

ఆటపాటలతో బోధన

సామాజిక సేవా శంకరుడు

పాఠశాలే తన ఇల్లుగా..

తణుకుకు చెందిన ప్రత్తిపాటి ఇస్సాకు, మార్తమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె జ్ఞాన కాంతికుమారి తణుకు మండలం వేల్పూరు పాఠశాలలో, రెండో కుమార్తె కాంతి ప్రియ చింతలపూడి మండలం సీతానగరంలోని పాఠశాలలో, మూడో కుమార్తె మెర్సీ రాణి పాలకొల్లు మున్సిపల్‌ స్కూలులో విధులు నిర్వర్తిస్తున్నారు. కుమార్తెల భర్తలు ముగ్గురూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉండటం విశేషం. ఇస్సాకు ఒక సామాన్య జీపు డ్రైవరుగా ఉపాధి పొందుతూ ముగ్గురు కుమార్తెలతోపాటు ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా కుమార్తెలు ముగ్గురినీ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు.

పెనుగొండ: చిచ్చర పిడుగుల్లాంటి చిన్నారులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ ఆకట్టుకుంటున్నారు పెనుగొండ మోడల్‌ ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయురాలు ప్రసూనాంబ. విద్యార్ధులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్‌ఎం చిత్రాలు ఏర్పాటు చేసి అవార్డులు అందు కున్నారు. 2003 నుంచి ఆమె అవార్డుల పరంపర సాగుతోంది. అలాగే సొంత ఖర్చులు, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. పెనుగొండ శివారం మల్లప్పదిబ్బలో 2003 మండల స్థాయిలో, 2014లో ఉత్తమ ఉపాధ్యాయురాలు, 2014లో దాతలు సహకారం, సొంత ఖర్చులతో పాఠశాలలను అభివృద్ధి చేసి మల్లప్ప దిబ్బలోని ఎంపీపీ పాఠశాలకు జిల్లాస్థాయి ఉత్త మ పాఠశాలగా ఎంపిక కావడానికి కృషి చేశారు. 2017లో సావిత్రీ బాయి పూలే అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పెనుగొండలో శెట్టిబలిజపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.

అజ్ఞానాన్ని పారదోలి జీవితంలో విజ్ఞాన కాంతులు నింపేవారే గురువులు. పేరుకు మూడక్షరాలే అయినా తరాల తలరాతను మార్చే సత్తా వారి సొంతం. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్న తర్వాత ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం కల్పించారు. వినూత్నంగా విద్యాబోధన, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ వారి ఉన్నతికి బంగారు బాటలు వేస్తున్నారు. – సాక్షి, భీమవరం

తణుకు రూరల్‌ తేతలి జెడ్పీ హైస్కూల్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాపతు మదనగోపాలరెడ్డి తన తండ్రి చెన్నారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 3న ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మెరిట్‌ విద్యార్థులకు 13 సైకిళ్లు చొప్పున గత 13 ఏళ్లుగా అందిస్తున్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా సౌకర్యాలను సమకూరుస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆయన సైకాలజిస్ట్‌, మెజీషియన్‌ కాగా పరీక్షల సమయంలో పిల్లలకు ఏకాగ్రతపై మోటివేషన్‌, యోగ, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సైన్స్‌ ప్రదర్శనలకు గైడ్‌ టీచర్‌గా వ్యవహరించి విద్యార్థులను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత సాధించారు. తణుకు మున్సిపల్‌ 4వ నంబరు పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఆయన సతీమణి రుద్రమదేవి సేవా కార్యక్రమాల్లో చేదోడుగా ఉంటూ ఈ జంట ఆదర్శంగా నిలుస్తున్నారు.

మాస్టార్లు

విద్యార్థులకు వినూత్నంగా బోధన

సమాజ సేవలోనూ ముందంజ

ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

విద్యార్థులకు ఆట, పాటలతో కూడిన బోధన కోసం తరగతి గదిని తీర్చిదిద్దడంలో నరసాపురం రూరల్‌ కొప్పర్రు ఎంపీపీ స్కూల్‌ టీచర్‌ ఉప్పుగంటి రాజశ్రీ అందెవేసిన చేయి. 27 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పాఠ్యాంశాల బోధనకు అవసరమైన సామగ్రిని స్వయంగా తయారుచేసి తరగతి గదిని తీర్చిదిద్దడం ఆమెకు హాబీ. పాఠ్యాంశాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, దేశ నాయకులు గురించి విద్యార్థులకు వివరిస్తూ క్రమం తప్పకుండా వారి జయంతి, వర్ధంతులను నిర్వహిస్తూ పోటీలను పెడుతుంటారు. వినోద, విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తెలుగు భాషపై అవగాహన కల్పించేందుకు శతక పద్యాల పోటీలు, కథ చెప్పడం, కథ రాయడంపై చిన్న వయసులోనే పిల్లలకు నూరిపోస్తుంటారు. పండుగలు, సామాజిక, పర్యావరణ రక్షణకు అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తుంటారు.

బోధనలోనే కాదు సామాజిక సేవల్లోను ముందుంటారు పాలకొల్లు జీవీఎస్‌వీఆర్‌ఎం మున్సిపల్‌ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం రాయపూడి భవానీ శంకర ప్రసాద్‌. 2000 నుంచి మున్సిపల్‌ టీచర్‌గా సేవలందిస్తున్నారు. పని చేసే చోట తనతో పాటు దాతల సహకారం తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేయడ, విద్యార్థులకు కావాల్సిన వివిధ సామగ్రిని సమకూర్చడం చేస్తుంటారు. పాఠశాలకు సరిగా రాని విద్యార్థులు గురించి ఆరా తీయడం, అనారోగ్య సమస్యలు ఉంటే దాతల ద్వారా అవసరమైన సాయం చేస్తుంటారు. గతంలో పలువురు విద్యార్థులకు వైద్యానికి అండగా నిలిచారు. విద్యార్థుల్లో సామాజిక దృక్పథం పెంపొందేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సామాజిక సేవలకు గాను పలు అవార్డులను అందుకున్నారు.

పాఠశాలే నా ఇల్లు. విద్యార్థులంతా నా కుటుంబ సభ్యులే అనే మనస్తత్వంతో ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు ఆకివీడుకు చెందిన ఉపాధ్యాయుడు గోనెళ్ల శ్రీనివాసపురుషోత్తం. మాట, పాట, ఆటలతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని, పోటీతత్వాన్ని, ప్రశ్నించేతత్వాన్ని అలవరుస్తున్నారు. విద్యార్థి స్కూలుకు రాలేదంటే ఆరా తీసి, జ్వరమైతే ఇంటికి వెళ్లి మరీ పలకరించి ఆదుకోవడం ఆయన నైజం. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించి వారికి ఆంగ్లంతో పాటు లెక్కలు, తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అందరి చేత శభాష్‌ అనిపించుకుంటూ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఎంపికయ్యారు. విద్యార్థులకు పోటీలు పెట్టి సొంత డబ్బులతో బహుమతులు అందజేస్తుంటారు. ఇలా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు కృషిచేస్తున్నారు.

గురుతర బాధ్యత.. సేవాతత్పరత 1
1/6

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

గురుతర బాధ్యత.. సేవాతత్పరత 2
2/6

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

గురుతర బాధ్యత.. సేవాతత్పరత 3
3/6

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

గురుతర బాధ్యత.. సేవాతత్పరత 4
4/6

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

గురుతర బాధ్యత.. సేవాతత్పరత 5
5/6

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

గురుతర బాధ్యత.. సేవాతత్పరత 6
6/6

గురుతర బాధ్యత.. సేవాతత్పరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement