
9న వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు
కాళ్ల: రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాలన నడుస్తోందని, రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టిందని, ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలి పారు. పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి దివంగత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నావడ్డీకే రుణాలు, సబ్సిడీపై పురుగు మందులు, ఎరువులు అందించామని గుర్తు చేశారు. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో 10,500 రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు.
బ్లాక్ మార్కెట్‌కు ఎరువులు
ప్రస్తుత కూటమి పాలనలో విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ప్రసాద రాజు ఆరోపించారు. అయినా ముఖ్యమంత్రి, వ్య వసాయశాఖ మంత్రి స్పందించకపోగా రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితి నెలకొందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అ న్నారు. రైతులు బ్లాక్‌లో రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోయారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రైతుల పక్షాన ఈనెల 9న భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కా ర్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు కరపత్రాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉండి, భీమవరం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పీవీఎల్ నరసింహరాజు, చినమిల్లి వెంకటరా యుడు, నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, కామన నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రైతులపై ప్రభుత్వానికి చిన్నచూపు
యూరియా సరఫరాలో విఫలం
రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉద్యమం
పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు