
మోసం చంద్రబాబు నైజం
పెంటపాడు: మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని దాటవేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం పడమరవిప్పర్రులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ మోసం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, సూపర్‌సిక్స్ పేరుతో ప్రజలను వంచించారన్నారు. కూటమి నాయకులు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఊపడం సరికాదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. ప్రతి కార్యకర్త కూటమి వైఫల్యాలను ఇంటింటా వివరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మద్యం మాఫియా సిండికేట్‌గా ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారన్నా రు. ముందుగా పత్సా అంజిబాబు నివాసం వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ అ ధ్యక్షులు జడ్డు హరిబాబు, వెలిచేటి నరేంద్ర, బండా రు నాగు, ములకాల రాంబాబు, పత్సా అంజిబా బు, ములకాల ప్రసాద్, ముప్పిడి సంపత్‌కుమార్, కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ