
మమ అనిపించారు
ఉండి: ఉండి బస్టాండ్‌లో రోడ్ల దుస్థితిపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించా రు. శనివారం బస్టాండ్ ప్రాంగణంలో రోడ్లపై గోతులను కంకరతో పూడ్చించి నామమాత్రంగా పనులు చేయించారు. అయితే మెత్తటి కంకరతో రోడ్లు పూడ్చించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు. వర్షం వస్తే బస్టాండ్‌లోనికి వెళ్లేందుకు గతంలో కొద్దోగొప్పో అవకాశం ఉండేదని, ఇప్పుడు చా లా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉండి: చెరుకువాడలో దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి, దళితులకు రక్షణ కల్పించాలని దళిత ఐఖ్యవేదిక రాష్ట్రాధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చెరుకువాడలో దళితులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్)/తాడేపల్లిగూడెం (టీ ఓసీ): తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూ ల్స్ పీజీటీ భీమడోలు రాజారావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాక్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని అనుమతి లేకుండా నరసాపురంలోని ఓ ప్రైవేటు కళాశాల కార్యక్రమానికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా కో–ఆర్డినేటర్ ఉమాకుమారికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.