
కూటమి పాలనలో రౌడీ సంస్కృతి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ధ్వజం
● దానిగూడెం దళితవాడలో బాధిత కుటుంబాలకు పరామర్శ
కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో ఎన్నడూచూడని కత్తులు, కర్రలతో దాడులు చేసే సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. వినాయక ఊ రేగింపు సందర్భంగా జనసేన కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన దానిగూడెం దళితవాడ బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించి చర్చిలో మాట్లాడారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ వినాయక ఊరేగింపులో డీజే సౌండ్ల వద్ద హారన్ కొట్టినందుకు జనసేన కార్యకర్తలు విచక్షణారహితంగా పయ్యేద్దు అజయ్, గొంతుపులి దినేష్‌బాబుపై బ్లేడు, కత్తులు, రాడ్లతో దా డి చేశారన్నారు. దీనిపై దళితులు ఆందోళన చేస్తే పోలీసులు తమపైనే లాఠీ చార్జీ చేశారని, తగిలిన దెబ్బలను డీఎన్నార్‌కు చూపించారు. గొడవలకు ప్రధాన సూత్రధారి, జనసేన నేత కొల్లి బాబీని కే సు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రోపించారు. తీవ్ర గాయాలైన అజయ్, దినేష్‌బా బు తండ్రులు శ్రీను, నానీలు కన్నీళ్లు పెట్టుకుని త మకు న్యాయం చేయాలని కోరారు. డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి పాలనలో రౌడీలమంటూ అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. పోలీసులు వారం ముందు అన్నసమారాధనలో జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇటువంటి హత్యయత్నాలు జరిగేవి కావన్నారు. కేసు విషయమై ఏలూరు ఎస్పీతో మాట్లాడానన్నా రు. నిందితులకు శిక్ష పడేవరకూ పార్టీ పరంగా దళితులకు అండగా ఉంటామన్నారు. రోడ్డుపై చేసిన ఆందోళనపై దానిగూడెం దళితులపై కేసు నమోదు చేసినట్టు తెలిసిందని, తక్షణమే ఈ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షంచకపోతే పార్టీపరంగా ఆందోళన చేస్తామని హె చ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప క్కన కూర్చుని రౌడీయిజం చేస్తున్న సంఘ విద్రోహులను పక్కన పెట్టి ప్రశాంత వాతావరణం కల్పించాలని డీఎన్నార్ కోరారు.