
●చంద్ర గ్రహణం.. ఆలయాల మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాల తలుపులకు మూతలు పడ్డాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం, భీమవరం మావుళ్లమ్మవారు, భీమవరం పంచారామక్షేత్రం, జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయ తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మూసివేశారు. ప్రధాన ద్వారాలు, గోపుర ద్వారాలను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యహవచనం అనంతరం భక్తులను అనుమతిస్తారు.
– ద్వారకాతిరుమల/భీమవరం (ప్రకాశం చౌక్)/జంగారెడ్డిగూడెం
గుర్వాయిగూడెంలో మద్ది అంజనేయస్వామి వారి ఆలయం వద్ద..
భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయగోపుర ద్వారం మూసివేసిన దృశ్యం

●చంద్ర గ్రహణం.. ఆలయాల మూసివేత

●చంద్ర గ్రహణం.. ఆలయాల మూసివేత

●చంద్ర గ్రహణం.. ఆలయాల మూసివేత