సచివాలయ ఉద్యోగుల పోరు బాట | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల పోరు బాట

Sep 8 2025 7:18 AM | Updated on Sep 8 2025 7:18 AM

సచివా

సచివాలయ ఉద్యోగుల పోరు బాట

ప్రధాన డిమాండ్లు ● అధిక పని భారం సమస్యలు పరిష్కరించాలి

సమస్యల వెల్లువ

● ఒకే మాతృ శాఖ కింద ఆత్మగౌరవంతో పనిచేయడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.

● అన్ని సర్వేలను సంబంధిత శాఖల ద్వారానే నిర్వహించి సచివాలయ సిబ్బందిపై భారం తొలగించాలి.

● పదోన్నతుల్లో జాప్యాన్ని నివారించి, జిల్లాల వారీగా, యూఎల్‌బీ వారీగా సీనియార్టీ లిస్టులు ప్రకటించి, ప్రక్రియను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలి.

● ప్రతి యూఎల్‌బీ ఖాళీల్లో కనీసం 50 శాతం ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి.

● 5 నుంచి 6 ఏళ్లు సర్వీస్‌ పూర్తిచేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌డ్‌ స్కీమ్‌ వర్తింపజేసి, రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

● ప్రొబేషన్‌ పీరియడ్‌లో రావాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన టైమ్‌ ఫ్రేమ్‌ నిర్ణయించాలి.

కూటమి ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులపై భారం వేసింది. గతంలో ఒక వలంటీర్‌ క్లస్టర్‌ (50 ఇళ్లు) చూసుకుంటే సచివాలయ ఉద్యోగికి ప్రస్తుతం మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర పని ఒత్తిళ్లతో విధులు నిర్వహించాల్సి వస్తోంది. శాఖాపరమైన పనులతో పాటు బీఎల్‌ఓ, అదనపు పనులు, సర్వేల భారాన్ని మోపారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మ గౌరవ ఉద్యమం చేపట్టాం.

– ఎ.శ్రీనివాస్‌, ఏపీ ఎంఎంఈఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, వార్డు సెక్రటరీ, భీమవరం

క్లస్టర్‌ మ్యాపింగ్‌ సిస్టమ్‌ సచి వాలయ సిబ్బందికి గుదిబండ వంటిది. గతంలో వలంటీర్లు ఉండటంతో సర్వేలు, పెన్షన్ల పంపిణీ సులభంగా జరిగేది. వలంటీర్లు లేకపో వడంతో సచివాలయ ఉద్యోగులపై భారం పెరిగింది. ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత కూడా సేవలందించాల్సి వస్తుంది. ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల బాధ్యతలు చూసుకోవడం చాలా భారంగా ఉంది. ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలు నిర్వహించడం కష్టంగా ఉంది. ప్రభుత్వం కొన్ని సర్వేలను థర్డ్‌ పార్టీ వారితో చేయించాలి. సచి వాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి.

–కె.శ్రీనివాస్‌, రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ

భీమవరం(ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమ బాట పట్టారు. పనిఒత్తిళ్లు, సర్వేల భారం, తమ ఆత్మగౌరవాన్ని దిగజార్చడంపై ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమ ర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏడు రోజులపాటు నిరసనలకు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థల ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థల ద్వారా ముంగిళ్లలోకే ప్రజలకు పాలనను చేరువ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ని ర్దాక్షిణ్యంగా వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది వలంటీర్లు ఉపాధి కో ల్పోయారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగింది. ఇంటింటా సర్వేలు, పింఛన్ల పంపిణీ, మల్టీ టాస్కింగ్‌ విధులతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ ఉద్యో గుల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ప్రభుత్వం వ్యవహరించడంపై రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మ గౌరవ ఉద్యమం పేరట నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 380 గ్రామ, 155 వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం 4,331 మంది నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని గళమెత్తుతున్నారు.

ఉద్యమ కార్యాచరణ

సచివాలయ ఉద్యోగులు ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తొలిరోజు (శనివారం) ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 2, 3 రోజుల్లో (సోమ, మంగళవారాలు) నల్ల బ్యాడ్జీలతో విధులకు హా జరు, 4, 5 రోజుల్లో (బుధ, గురువారాలు) అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి వైదొలగడం, 6,7 రో జుల్లో (శుక్ర, శనివారాలు) పెన్‌డౌన్‌ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపనున్నారు.

ఆత్మగౌరవ ఉద్యమం

సర్వేల భారంతో సతమతం

ఒత్తిళ్లతో విధుల నిర్వహణ

మహిళా, దివ్యాంగ సిబ్బందికి తప్పని ఇబ్బందులు

ప్రభుత్వ వైఖరిపై మండిపాటు

జిల్లాలో 4,331 మంది ఉద్యోగుల నిరసన గళం

వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఒక్కో ఉద్యోగి మూడు నుంచి ఐదు క్లస్టర్ల పరిధిలో సేవలందించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి 150 నుంచి 250 కుటుంబాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగా మారింది.

సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, ఉపాధి తదితర సర్వేల భారాన్ని ప్రభుత్వం మోపడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు.

మల్టీటాస్కింగ్‌ పేరుతో మాతృశాఖ పనులతో పాటు ఇతర శాఖల పనులు కూడా చేయమని బలవంతం చేస్తున్నారు. డాష్‌ బోర్డులు, టార్గెట్ల పేరిటపై అధికారులు వేధిస్తున్నారు.

సర్వేలకు వెళ్లినప్పుడు మహిళా సిబ్బంది సామాజిక వేధింపులకు గురవుతున్నారు. రక్షణపై ఆందోళన చెందుతున్నారు.

సర్వే కోసం ఇంటింటా తిరగడం దివ్యాంగ సిబ్బందికి ఇబ్బందిగా ఉంది.

సర్వే సమయంలో ఆధార్‌, బయోమెట్రిక్‌, ఓటీపీలు చెప్పేందుకు కొందరు సహకరించడం లేదు.

సంక్షేమం, ఉద్యోగ ప్రయోజనాలు వంటి విషయాల్లో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వేల విషయంలో ఒత్తిడి పెంచడం, సర్వే కాలేదనే కారణంతో సస్పెండ్‌ చేయడం ఉద్యోగులను ఆందోళన కలిగిస్తోంది.

పని ఒత్తిళ్లతో కుటుంబ జీవనానికి దూరమవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు.

సచివాలయ ఉద్యోగుల పోరు బాట1
1/3

సచివాలయ ఉద్యోగుల పోరు బాట

సచివాలయ ఉద్యోగుల పోరు బాట2
2/3

సచివాలయ ఉద్యోగుల పోరు బాట

సచివాలయ ఉద్యోగుల పోరు బాట3
3/3

సచివాలయ ఉద్యోగుల పోరు బాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement