ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి | - | Sakshi
Sakshi News home page

ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి

Sep 7 2025 8:34 AM | Updated on Sep 7 2025 8:34 AM

ఎనీవే

ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి

దళితులపై దాడులు దారుణం మేం బానిసలం కాదు..

న్యూస్‌రీల్‌

ఫేక్‌ ఫొటోతో అర్జీ క్లోజ్‌

దళితులపై దాడులు దారుణం
కై కలూరు మండలం దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. 8లో u

మేం బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 8లో u

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం/ ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, ఆకివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు లోపభూయిష్టంగా జ రుగుతున్నాయా? అమరావతి, చుట్టుపక్కల జి ల్లాల వారు రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారా?.. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడకుండా భూములు, స్థలాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా ప్రభుత్వం ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ వీలు కల్పించింది. సాధారణంగా నిషేధిత జాబితాలోని భూములు, స్థలాలపై స్థానిక సబ్‌ రిజిస్ట్రార్లకు అవగాహన ఉంటుంది. ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటేనే రిజిస్ట్రేషన్‌ చేస్తుంటారు. బయటి ప్రాంతాల్లోని వారికి ఈ భూములపై అవగాహన ఉండదు. బయటి ప్రాంతాల డా క్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఏ రియాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి అ న్నీ ధ్రువీకరించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేయా లి. అయితే ఎనీవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తూ కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. గతంలో మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బయ టి ప్రాంతాలకు చెందిన నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్‌ చేశారన్న విషయంలో సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకున్నారు. అయినా కొందరి తీరులో మార్పు రావడం లేదు.

వందలాది ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లు

ప్రస్తుతం ఉండి, ఆకివీడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల్లో ఉండి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 1,013 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయగా వీటిలో 300 లకు పైగా ఇతర జిల్లాలకు చెందిన వారివే ఉన్నాయి. ఆకివీడులో వెయ్యికి పైనే రిజిస్ట్రేషన్లు జరగ్గా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, మండవల్లి, ఉయ్యూరు, ఏలూరు జిల్లా కై కలూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, పల్నాడు జిల్లా గురజాల, గుంటూరు జిల్లా పెదకాకాని, జంగారెడ్డిగూడెం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వారి రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎనివేర్‌ రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల అనుమతులు కావాలంటూ అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. మంగళ, శుక్రవారాలు, అమావాస్య రోజుల్లోనూ బయట జిల్లాల వారితో ఆయా కార్యాలయాలు కళకళలాడుతుంటాయని తెలిసింది. ఆయా కార్యాలయాల వద్ద లేఖర్లదే ఇష్టారాజ్యమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాతుకుపోయిన కొందరు అన్నీ తామై వ్యవహరిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.

నా భూమిని నాకు స్వాధీనం చేయకపోవడంతో పాటు వేరే వారి పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులు, లేఖర్లపైనా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులను అడుగుతుంటే సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవులో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయమై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. సమస్యను పరిష్కరించినట్టుగా ఫేక్‌ ఫొటో అప్‌లోడ్‌ చేసి నా అర్జీని క్లోజ్‌ చేశారు.

– కురెళ్ల రాజ్‌కుమార్‌, గణపవరం

కాళ్ల మండలం కలవపూడిలో దాదాపు రూ.2.50 కోట్ల విలువైన 1.68 ఎకరాల గ్రామ కంఠం భూమిని జూన్‌ 30న ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ తన భర్త పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో జూలై 15న రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

కృష్ణా జిల్లా చినగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు కుటుంబానికి చినగొల్లపాలెంలో 32 ఎకరాల సాగు భూమి ఉంది. కొందరు ఉండి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రంగబాబు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అందుకు కొమ్ముకాస్తున్నారంటూ టెంట్‌ వేసి నిరసన తెలిపారు.

గణపవరానికి చెందిన కురెళ్ల రాజ్‌కుమార్‌కు ఏలూరు జిల్లా కలిదిండి మండలం పటమటిపాలెంలోని 9 సెంట్ల భూమి ఉంది. ఏప్రిల్‌ 24న ఉండి సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేశారు. విషయం తెలుసుకున్న రాజ్‌కుమార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సవరణ పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసినట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. సబ్‌ రిజిస్ట్రార్‌ దాదాపు రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరుతూ బాధితుడు పీజీఆర్‌ఎస్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా సమస్యను పరిష్కరించి ఉండి ఎస్సై చేతులమీదుగా రాజ్‌కుమార్‌కు ఎండార్స్‌మెంట్‌ ఇచ్చినట్టు నాలుగు రోజుల క్రితం పీజీఆర్‌ఎస్‌ సైట్‌లో అధికారులు ఫేక్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాలు దండి

ఒకరి భూమి మరొకరి పేరుపై ఉండిలో రిజిస్ట్రేషన్‌

రెండు నెలలుగా సెలవులోనే సబ్‌ రిజిస్ట్రార్‌

గ్రామ కంఠం భూమిని రిజిస్టర్‌ చేసేసిన మరో సబ్‌ రిజిస్ట్రార్‌

రిజిస్ట్రేషన్ల కోసం పొరుగు జిల్లాల నుంచి జనం క్యూ

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి1
1/2

ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి

ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి2
2/2

ఎనీవేర్‌కు కేరాఫ్‌ ఉండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement