
గురువుల పాత్ర కీలకం
తాడేపల్లిగూడెం: సమాజంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని శుక్రవారం ఏపీ నిట్‌లో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు అన్నారు. ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో ఎంతో అమూల్యమైందన్నారు. గురువే విద్యార్థుల జీవితానికి మార్గదర్శి అన్నారు. విద్యార్థులను అజ్ఞానం నుంచి విజ్ఞాన వెలుగుల దిశగా నడిపించేది ఉపాధ్యాయులే అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అసోసియేట్ డీన్‌లు డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి ,శ్రీనివాసన్, ఆచార్యులు పి.శంకర్, కార్తికేయశర్మ, అమరేంద్రరెడ్డి, కిషోర్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: బెల్టు దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఎకై ్సజ్ శాఖ దాడులు నిర్వహించినట్లు తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. తణుకు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో దువ్వ గ్రామానికి చెందిన ఇందుకూరి నాగరాజు, తేతలి గ్రామానికి చెందిన పంది గోగులు నుంచి 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెల్టు దుకాణాలు నిర్వహించినా, మద్యం దుకాణాల్లోని పర్మిట్ రూంలలో కాకుండా బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరుతున్న నీటితో వరద ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.250 మీటర్ల మేర నీటిమట్టం కొనసాగుతోంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 9.10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద 40.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వరద మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పాలకొల్లు సెంట్రల్: జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నేడు లఘు చలన చిత్రాల పోటీలు నిర్వహించనున్నారు. శనివారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఉన్న రామచంద్ర గార్డెన్స్‌లో ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రదర్శనకు 30 లఘు చిత్రాలు రాగా వాటిలో 12 చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనకు మరో ఆరు చిత్రాలను ఎంపిక చేశారు. ఈ షార్ట్ ఫిలిం పెస్టివల్‌లో పాలకొల్లు పట్టణానికి చెందిన కళాకారుడు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణను సన్మానించనున్నారు.

గురువుల పాత్ర కీలకం