
ప్రత్తిపాడు– బాదంపూడి రోడ్డెక్కితే టెర్రరే
సంక్రాంతికి రోడ్లు వేస్తామన్నారు. చివరకు అరకొర మరమ్మతులతో సరిపెట్టారు. తాడేపల్లిగూడెంలో ఒక్క ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయకుండానే మమా అనిపించారు. బాదంపూడి నుంచి ప్రత్తిపాడు వరకూ ఉన్న ప్రధాన రహదారి తాడేపల్లిగూడెం పట్టణానికే కాకుండా, తణుకు, రావులపాలెం వంటి ప్రాంతాలకు ఎంతో కీలకం. తాము అధికారంలోకి రాగానే ఈ రోడ్డు వేస్తామని జనసేన ఎమ్మెల్యే ఊదరగొట్టారు. ఇప్పుడు ఏడాదిన్నర దాటినా కనీసం దీనివైపు కన్నెత్తి చూడడం లేదు. చిన్నాచితకా రోడ్లకు చేసినా మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఈ రోడ్డు నరకాన్ని తలపిస్తోంది. ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై కాళు,్ల చేతులు విరగ్గొట్టుకున్నారు. గతంలో చిన్నపాటి గోతులపై రాజకీయం చేసిన కూటమి నేతలు ఇప్పుడు భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదు. –పెంటపాడు

ప్రత్తిపాడు– బాదంపూడి రోడ్డెక్కితే టెర్రరే