
రవాణా కార్యాలయాల్లో ఎకై ్సజ్ తనిఖీలు
తణుకు అర్బన్: తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తణుకు పట్టణంలోని పలు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్‌లు, ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి మాట్లాడుతూ రవాణా కార్యాలయాల్లో సరుకులు, సామాగ్రి రవాణా చేసే క్రమంలో పూర్తిస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ చట్టం ప్రకారం ఎన్‌డీపీఎస్ చట్టం పరిధిలోకి వచ్చే ఆల్కహాలు, సారా, గంజాయి, ఇతర డ్రగ్స్ రవాణా చేయుటకు అనుమతిస్తే ఆ కార్యాలయాలు, సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు. అనుమానిత సామాగ్రిని గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.