దసరాను ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

దసరాను ప్రశాంతంగా నిర్వహించాలి

Oct 15 2026 7:54 AM | Updated on Oct 15 2026 7:54 AM

దసరాను ప్రశాంతంగా నిర్వహించాలి

హసన్‌పర్తి: దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు పెట్రోలింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ పరిఽధిలో నమోదైన నేరాలు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలను స్టేషన్ల వారీగా సమగ్రంగా సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు గుర్తించి, వాటి దర్యాప్తుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ పెండింగ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు, పరారీలో ఉన్నవారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పేర్కొన్నారు. కేసులు పెండింగ్‌ ఉండకుండా, ప్రతి కేసుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, ఆస్తి నేరాలు, సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన తీవ్రమైన నేరాల తదితర కేసుల దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సమీక్షలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, హన్మకొండ ఏసీపీ నరసింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

కేసుల దర్యాప్తును పారదర్శకంగా

చేపట్టాలి : సీపీ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement