● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే శంకుస్థాపనలతోపాటు ప్రారంభోత్సవాలు కూడా చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని రాజుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను బుధవారం ఆయన క్షణ్ణంగా పరిశీలించి కాంట్రాక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సమయానికి స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన
పరకాల పట్టణంలోని శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణం, దామెర చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, వైస్ చైర్మన్ ఏకు దివ్య, మున్సిపల్ కమిషనర్ పి.పవన్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


