బతుకమ్మలతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మలతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

Oct 15 2026 7:54 AM | Updated on Oct 15 2026 7:54 AM

బతుకమ్మలతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

హన్మకొండ అర్బన్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. రాష్ట్రంలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు, 78 కేడర్లకు చెందిన సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి, బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణతోపాటు వేతన సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె కారణంగా పలు జిల్లాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తేవడం ఆపాలని కోరింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మహేందర్‌ రావు పుట్ట డిమాండ్‌ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement