సహకార సంఘం సందర్శన | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘం సందర్శన

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

సహకార సంఘం సందర్శన

భీమదేవరపల్లి; హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ తౌటం రోహిత్‌ నేత మంగళవారం ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకును సందర్శించారు. ఈసందర్భంగా ఆయనకు సంఘం జనరల్‌ మేనేజర్‌ ఎం.రాంరెడ్డి ఘన స్వాగతం పలికారు. సంఘం ద్వారా రైతులకు అందుతున్న సేవలు, విత్తనోత్పత్తి, రుణాల పంపిణీ, ఎరువుల సరాఫరా తదితర విధివిధానాలు, కార్యకలాపాలపై సమగ్రంగా వివరించారు. రైతాంగానికి సహకార రంగం ద్వారా అందిస్తున్న తోడ్పాటును ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, భీమదేవరపల్లి మండల వ్యవసాయాధికారి పద్మ, ఏఈఓలు కమల్‌హాసన్‌, సంతోష్‌తో పాటు సంఘం వ్యవసాయ అధికారులు సంగ శ్రీనివాస్‌, ముచ్చ అచ్యుత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement