‘గ్రేటర్‌’ యూజీడీకి రూ.5వేల కోట్ల రుణం | - | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’ యూజీడీకి రూ.5వేల కోట్ల రుణం

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

‘గ్రేటర్‌’ యూజీడీకి రూ.5వేల కోట్ల రుణం

వరంగల్‌ అర్బన్‌ : మూడు దశాబ్దాలుగా అస్తవ్యస్త డ్రెయినేజీ వ్యవస్థతో పడుతున్న గ్రేటర్‌ వరంగల్‌ నగరవాసులకు శుభవార్త. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ(యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మన యూజీడీ ప్రతిపాదనలను జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్‌ అంగీకరించింది. విదేశీ సంస్థ రుణ మంజూరుకి కేంద్ర ఆర్థిక శాఖ, గృహ, పట్టణాభివృద్ధి సంస్థలు తాజాగా జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశాయి. మహానగర వ్యాప్తంగా అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం (సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు) కల సాకారం కానుంది. యూజీడీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.5,257కోట్ల ప్రతిపాదనలకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల కోసం రెండు దఫాలుగా స్థలాల సేకరణ ఆదేశాలిచ్చారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో పనులకు శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బృహతర్త ప్రాజెక్టుకు అంకురార్పణ పడనుంది.

మిగిలింది టెండర్లే..

యూజీడీకి రుణం మంజూరైనందున మిగిలిన ప్రక్రియ టెండర్ల నిర్వహణే. ఇప్పటికే నగరంలో యూజీడీని ఏడు జోన్లుగా విభజించారు. నగరం 407.7చదరపు కిలోమీటర్లు ఉండగా, 3,137కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఓపెన్‌ డ్రెయినేజీ వ్యవస్థ 2,780 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన ఎన్‌కే బిల్డ్‌ కాన్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌ సంస్థ డీపీఆర్‌లను రూపొందించింది. 2027నాటికి నగర వ్యాప్తంగా ఉన్న 2,92,194 ఇళ్లకు సీవరేజ్‌ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఏడు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా రోజు 140–160 మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే (ఎంఎల్‌డీ) మురుగునీటిని శుద్ధిచేసే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారు. కీలకమైన ప్రాజెక్టును పబ్లిక్‌ హెల్త్‌శాఖ అధికారులకు అప్పగించనున్నారు. 1995లో ప్రారంభమైన యూజీడీ ప్రక్రియ ఎట్టకేలకు వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

నిధులను సమకూర్చనున్న

జర్మనీ సంస్థ

కేంద్ర ఆర్థిక, గృహ నిర్మాణ,

పట్టణాభివృద్ధి శాఖలు గ్రీన్‌ సిగ్నల్‌

త్వరలో టెండర్ల ప్రక్రియ..

సీఎంతో పనులకు శంకుస్థాపన

వచ్చే ఏడాదినుంచి

పట్టాలెక్కనున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement