కరువుతో కబేళాకు పశువులు! | - | Sakshi
Sakshi News home page

కరువుతో కబేళాకు పశువులు!

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

కరువుతో కబేళాకు పశువులు!

పరకాల: వర్షాలు సమయానుకూలంగా లేకపోవడంతో సాగు పనులు లేక కరువు పరిస్థితుల్లో పశుగ్రాసం దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో రైతులు తమ పశువులను అమ్మేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుంటున్న బేరగాళ్లు తక్కువ ధరకు పశువులను కొని కబేళాలకు తరలిస్తున్నారు. పరకాల సంతలో ప్రతీ వారం వందలాది పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి.

ఇక్కడి నుంచే తరలింపు..

పశువుల విక్రయాల్లో పరకాల సంత మొదటి స్థానంలో నిలుస్తోంది. టెండర్‌ ప్రక్రియ ద్వారా ప్రతీ ఏడాది పరకాల మున్సిపాలిటీకి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షలకు ఆదాయం వస్తుంది. వారానికి 100 నుంచి 200కు పైగా పశువులను, గేదేలను లారీలలో కబేళాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ అవసరాల కోసమే పశువులను విక్రయించాలి. జంతువులపై క్రూరత్వ నిరో ధక చట్టం 2017ను కేంద్ర పర్యావరణ శాఖ గెజిట్‌ ప్రకారం సంతల్లో ఆవు, గేదె, ఎద్దులను కబేళాలకు అమ్మకూడదు.. కొనకూడదు. కొనుగోలుదారుడు వ్యవసాయాదారుడిగా రుజువు చేస్తూ సంత కమిటీ ధ్రువీకరణప్రతం అందజేయాల్సి ఉంటుంది. కానీ, పరకాల సంతలో ఇవేమీ పట్టడం లేదు.

వ్యవసాయం లేక..

వ్యవసాయం లేదు. అడపాదడపా వేసిన వరి నీరు లేక ఎండిపోతోంది. ఉన్న అప్పులను తీర్చుకోవడానికి రైతులు పశువులను అమ్ముకోవడానికి సంత బాట పడుతున్నారు. ధర పెట్టే వారు లేక కోతలకే అమ్ముకోవాల్సి వస్తుంది. పశువులను అమ్ముకున్న వ్యవసాయానికి చేసిన అప్పులు తీరేలా లేవ ని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు లేక వ్యవసాయం సాగక విక్రయాలు

పరకాల పశువుల సంతనుంచి నేరుగా కోతలకు

వారానికి వందలాది తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement