నా భర్త కరోనా కాలంలో చనిపోయాడు. నాకు ఇప్పటి వరకు వితంతు పింఛన్ రావడంలేదు. కుటుంబ జీవనం కష్టంగా మారింది. కష్టం చేయడానికి కూడా చేతకావడం లేదు. ఫించన్ ఇప్పించాలని దరఖాస్తు చేశా.
– రజియా, ఎల్లంబజార్, వరంగల్
కరువు మండలాలను ప్రకటించాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు, కూలీలు కరువు నెలకొని అల్లాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి. అధికారులు త్వరగా పరిస్థితులను అంచనా వేసి నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. రైతులు, కూలీలను ఆదుకోవాలి.
– తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
●


