ఖానాపురం: కేసుల వివరాలను ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లోని గదులు, రికార్డులను పరిశీలించా రు. సన్నిహిత కేంద్రాన్ని పరిశీలించి ఫిర్యాదుల ఎంట్రీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రికార్డుల ను ఆన్‌లైన్ చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ శంకర్‌రావు, సిబ్బంది సీతారామరాజు, సుమన్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన పెద్ది స్వప్న
నర్సంపేట: మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్‌రెడ్డి సోమవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజ్‌కుమార్ ఎన్నికై న సందర్భంగా హరీష్‌రావు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్‌చంద్ర, తదితరులు ఉన్నారు.
అడ్మిషన్ల గడువు పొడిగింపు
కాశిబుగ్గ: వరంగల్ ములుగు రోడ్డులోని హనుమకొండ ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో మిగిలి ఉన్న కొత్త కోర్సుల సీట్ల భర్తీ కోసం ఐదో దశలో భాగంగా వాక్ ఇన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఇసారాఫ్ సురేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి గాను ఎలక్ట్రానిక్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, వెల్డర్, అధునాతన కోర్సులైన వర్చువల్ అనాలిసిస్, డిజైనర్ –ఎఫ్‌ఈఎం( పరిమిత మూలక పద్ధతి), ఇంజనీరింగ్ డిజైన్ టెక్నిషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్ ట్రేడ్స్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమెటిక్, ఎలక్ట్రిక్ మెకానిక్ వాహనం, డ్రోన్ టెక్నిషియన్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని తెలిపారు.
వేయిస్తంభాల దేవాలయంలో మహాచండీహోమం
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం మహా చండీహోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి ప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, గణపతిపూజ, శ్రీరుద్రేశ్వరీ ఉత్సవమూర్తిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో దుర్గార్చన చేశారు.


