కాళోజీ సెంటర్: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 12వ జాతీయ స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో తెలంగాణ నుంచి 52 ప్రాజెక్టులు ప్రదర్శిస్తుండగా.. వరంగల్ జిల్లా నుంచి ఆరు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పదర్శనలో పాల్గొన్నట్లు జిల్లా సైన్స్ అధికారి పెట్లొజు సురేష్ బాబు తెలిపారు.
ఆకట్టుకుంటున్న ఆరు ప్రాజెక్టులు
రైళ్లలో పై బెర్తులకు ఎక్కేందుకు మడత నిచ్చెన, సైకిల్ ద్వారా చెత్త సేకరణ, అపార్ట్మెంట్లలో మిగులు ఆహార పంపిణీ వ్యవస్థ, పోర్టబుల్ ధాన్యం ఆరబెట్టే యంత్రం, సురక్షితంగా పైకప్పులకు రంగులు వేసే పెయింటింగ్ రోలర్, పెడల్తో పనిచేసే హ్యాక్సా యంత్రం వంటి వినూత్న ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు రోజువారీ సమస్యలకు తక్కువ ఖర్చుతో పరిష్కారాలు చూపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆహార వృథా నివారణ, రైతులకు ప్రయోజనం, కార్మికుల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ సందర్భంగా డీఈఓ రంగయ్యనాయుడు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, అకడమిక్ మానిటరింగ్ అధికారి మహేష్ నాయక్ విద్యార్థులు, గైడ్ టీచర్లను అభినందించి, పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయిలో
ఆరు వినూత్న ప్రాజెక్టుల ప్రదర్శన


