నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

పర్వతగిరి: నేరాల నియంత్రణలో నిఘా నేత్రాలు ఉపయోగపడతాయని మామునూరు ఏసీపీ వెంకటేష్‌ అన్నారు. మండలంలోని అన్నారంషరీఫ్‌ గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రమాదాల నివారణ, గ్రామంలోని భద్రతకు ప్రాముఖ్యం ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పిన్నింటి అనిల్‌రావు, సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై బోగం ప్రవీణ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సావిత్రి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అన్నారం సర్పంచ్‌ గాడిపెల్లి మహేందర్‌, ఉపసర్పంచ్‌ గొడుగు ఏకాంతసారయ్య, ఏఎంసీ డైరెక్టర్‌ గొడుగు భిక్షపతి, దూపతండా సర్పంచ్‌ ధర్మసోత్‌ తిరుపతి పాల్గొన్నారు.

మామునూరు ఏసీపీ

వెంకటేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement