రబీ సీజన్‌లో వరిసాగు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

రబీ సీజన్‌లో వరిసాగు చేయొద్దు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

రబీ సీజన్‌లో వరిసాగు చేయొద్దు

దామెర: రబీ సీజన్‌లో రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరి సాగు చేయొద్దని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. ఎల్‌నినో పరిస్థితులపై సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, అధికారులు, రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా దామెర రైతు వేదికలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు చేసిన సూచనలు రైతులు తప్పక పాటించాలన్నారు. ఎల్‌నినో పరిస్ధితుల కారణంగా నీటి లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. బిందు సేద్యంతో కూరగాయలు, పప్పుదినుసుల పంటలు సాగుచేయాలన్నారు. జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పారమ్‌ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాతావరణ ప్రతికూల పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్‌చంద్ర, డీఆర్డీఓ మేన శ్రీను, తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఏఈ అల్లె రాకేశ్‌, సర్పంచ్‌ గరిగె కల్పన కృష్ణమూర్తి, దాడి వసంత రమేశ్‌, బొంకూరి రవియాదవ్‌, కేతిపల్లి శ్రీధర్‌రెడ్డి, దాసి శ్రీకాంత్‌, తోట రజిత శ్రీనివాస్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

అర్జీలు త్వరగా పరిష్కరించాలి..

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన ప్రతీ అర్జీపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా చూడాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 98 అర్జీలు అందగా, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో 30, ఎంపీడీఓ కార్యాలయాల్లో 97 అర్జీలు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 225 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్‌.రవి, బి.శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement