శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ | - | Sakshi
Sakshi News home page

శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలో దేవీశరన్నవరాత్ర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు అధ్వర్యంలో అర్చకులు సర్వశుభంకరి, మంగళప్రదాయినైన అమ్మవారికి నిర్మాల్యసేవ, అభిషేకాదులు నిత్యహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం చేశారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, పర్యగ్నికరణం, భేరీపూజ, భేరీతాడనం, ధ్వజారోహణం చేసి కలశస్థాపన నిర్వహించారు. యూనియన్‌ బ్యాంకులో భద్రపరిచిన అమ్మవారి ఆభరణాల బాక్సులను పోలీస్‌ బందోబస్తుతో సిబ్బంది దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారికి ధరింపజేశారు. తర్వాత బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలు చేశారు. శైలపుత్రి క్రమంలో పూజలు జరిపి వృషభవాహనంపై, యోగనిద్ర క్రమంలో పూజలు జరిపి మృగవాహనంపై ఊరేగించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన పొన్నలూరి వెంకటసుబ్రహ్మణ్యం, రాజ్యలక్ష్మి దంపతులు సుమారు రూ.1.50 లక్షలు ఖరీదు చేసే వంటపాత్రలను ఈఓ రామల సునీత సమక్షంలో అందజేశారు. వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఆనందంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు.

బాలత్రిపురసుందరిదేవీగా

భద్రకాళి అమ్మవారు

శైలపుత్రి క్రమంలో, యోగనిద్ర క్రమంలో పూజలు

వృషభవాహనంపై, మృగవాహనంపై

సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement