● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
పరకాల: కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చి గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులు ఆదివారం హైదరాబాద్లో ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారం బహిరంగ మార్కెట్లో కనీసం 10 శాతం కూడా మించకపోవడం అన్యాయమని అన్నారు. న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్లు, ఎంపీ ఈటల రాజేందర్ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాధిత రైతులు బూర్గుల రామచంద్రరావు, నల్లల సతీశ్, పెళ్లి జనార్దన్, గోనె రాజిరెడ్డి, టైల్ సాంబయ్య, అబ్బాడి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


