పాఠశాలలకు టాయిలెట్లు మంజూరు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలకు టాయిలెట్లు మంజూరు

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

టీఎస్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా పనులు

పాఠశాలల వారీగా మంజూరైన టాయిలెట్ల వివరాలు

కాళోజీ సెంటర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా మరో ముందడుగుపడింది. పాఠశాలల వారీగా పనులు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్‌, సమగ్రశిక్ష ప్రాజెక్టు రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌నికోలస్‌ టీఎస్‌డబ్ల్యూఎస్‌ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠశాలల్లో (6 నుంచి 12 తరగతులు) బాలురు, బాలికల కోసం మరుగుదొడ్లు (టాయిలెట్లు) మంజూరయ్యాయి. 9 పాఠశాలల్లోని 10 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.47.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను తగిన ప్యాకేజీలుగా విభజించి ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

జిల్లాలో గుర్తించిన 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అవసరాన్ని బట్టి బాలుర, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వులు వచ్చాయి.. ఈ పనులు టీఎస్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపడతారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.4.75 లక్షలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

– తాటిపల్లి విజయ్‌కుమార్‌,

ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌

మండలం జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర బాలికల నిధులు

టాయిలెట్లు (రూ.లక్షల్లో)

దుగ్గొండి మహమ్మదాపూర్‌ 0 1 4.75

గీసుకొండ మచ్చాపూర్‌ 1 1 9.50

ఖానాపురం అశోక్‌నగర్‌ 1 0 4.75

నల్లబెల్లి రుద్రగూడెం 1 0 4.75

రాయపర్తి తిరుమలాయపాలెం 1 0 4.75

రాయపర్తి రాయపర్తి 0 1 4.75

రాయపర్తి ఊకల్‌ 1 0 4.75

వరంగల్‌ సుందరయ్యనగర్‌ 1 0 4.75

వర్ధన్నపేట ఇల్లంద 1 0 4.75

మొత్తం 7 3 47.50

రూ.47.50 లక్షల నిధులతో పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement