రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

వర్ధన్నపేట: రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. చెన్నారం చేపట్టిన భూముల రీ సర్వేను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. సర్వే ఏ మేరకు పూర్తయ్యింది, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సర్వేలో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌, ఆర్డీఓ సుమ, తహసీల్దార్‌ విజయసాగర్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సహాయ సంచాలకుడు శ్రీనివాస్‌ ఉన్నారు.

ఈవీఎంల గోదాం తనిఖీ

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని ఈవీఎంల గోదాంను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రతకు సంబంధించిన చర్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ రజిని పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement