ఎయిడ్స్‌ నియంత్రణలో జాతీయస్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ నియంత్రణలో జాతీయస్థాయి గుర్తింపు

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

గీసుకొండ: ఎయిడ్స్‌ నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి తెలిపారు. నాకో (నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) విడుదల చేసిన ర్యాంకుల్లో జిల్లాకు సురక్షిత్‌ స్థానం దక్కిందని, సురక్షిత్‌ ప్లస్‌ సాధించడానికి కృషి చేయాలన్నారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎయిడ్స్‌ నియంత్రణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ సత్యశారద మార్గదర్శకంలో వైద్య, ఆరోగ్య శాఖ ఐ సీటీసీలు, ఏఆర్‌టీ కేంద్రం, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉ చితంగా యాంటీ రెట్రోవైరల్‌ మందులు, కౌన్సెలింగ్‌, సీడీ4, వైరల్‌ లోడ్‌ పరీక్షలు చేస్తోందన్నారు. పీఓ అరుణ్‌కుమార్‌ జోషి, ప్రాజెక్టు మేనేజర్‌ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్‌వైజర్‌ రామకృష్ణ, ఏఓ కమలాకర్‌, ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘నాకో’ ర్యాంకింగ్‌లో జిల్లాకు

సురక్షిత్‌ స్థానం : డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement