కార్పొరేట్‌ విద్యనందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ విద్యనందించడమే లక్ష్యం

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

వర్ధన్నపేట: కార్పొరేట్‌ స్థాయి విద్యా వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. కట్య్రాల గ్రామ పరిధిలో ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. 16–11 ఎకరాల్లో రూ.200 కోట్ల ఖర్చుతో చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీలో సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి స్కూల్‌కు భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగించాలన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు ఆధునిక విద్య, వసతులు మరింత చేరువవుతాయన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, పలు శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement