గత పాలకులవి మోసపూరిత మాటలు | - | Sakshi
Sakshi News home page

గత పాలకులవి మోసపూరిత మాటలు

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

పరకాల: గత బీఆర్‌ఎస్‌ పాలకుల మోసపూరిత మాటలతో పరకాల పట్టణం వెనుకబడిపోయిందని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల పట్టణాన్ని ఒక మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. గురువారం పరకాల పట్టణంలో వాడవాడకు బైక్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరకాలను ఒక మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన డీపీఆర్‌ వ్యవస్థతో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి వసతులతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సునీల్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ ఏకు దివ్య, మున్సిపల్‌ కమిషనర్‌ పోతరాజు పవన్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రవణ్‌కుమార్‌, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement