ఓటర్ల సవరణలో జోరు! | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల సవరణలో జోరు!

Oct 9 2026 1:32 AM | Updated on Oct 9 2026 1:32 AM

ఓటర్ల సవరణలో జోరు!

ఠిసాక్షిప్రతినిధి, వరంగల్‌: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఊపందుకుంది. కొత్తగా పేర్లు చేర్చడం, పేర్లు తొలగించడం, చిరునామాలు మార్చడం, తప్పులను సరిచేయడం తదితర అంశాలపై ప్రజలనుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. జూన్‌ 15 నుంచి బుధవారం వరకు ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల పరిధిలో 62,500కు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటివరకు వేలాది దరఖాస్తులపై అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు 24,832 దరఖాస్తులు వచ్చాయి. పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల సవరణకు ఏకంగా 35,425 దరఖాస్తులు అందడం గమనార్హం. అనర్హుల పేర్ల తొలగింపు, అభ్యంతరాల కోసం 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 962 పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటర్ల నమోదుకు 140 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల విషయంలో వరంగల్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ కొత్త ఓటర్ల నమోదుకు 9,221, విదేశీ ఓటర్ల నమోదుకు 55, పేర్ల తొలగింపునకు 319, వివరాల సవరణకు 11,963 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 21,558 దరఖాస్తులు అందాయి.

తుది జాబితాపై ఆసక్తి..

ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. తదుపరి దశలో అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించడం, అభ్యంతరాలపై విచారణ, అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం వంటి ప్రక్రియలు జరగనున్నాయి. ఈ నెల 7 వరకు విడుదలైన ఈ నివేదికలో ఎన్ని నోటీసులు జారీ చేశారు? ఎన్ని దరఖాస్తులను తిరస్కరించారు? ఎన్ని దరఖాస్తులు తుది పరిష్కారం పొందాయి? సవరణ అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతకు చేరింది? అనే వివరాలను ప్రత్యేకంగా వెల్లడించలేదు. ఈ గణాంకాలు వెలువడితే ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా చేరిన ఓటర్లు ఎంతమంది.. తొలగించిన ఓటర్లు ఎంతమంది.. వివరాలు సరిచేసుకున్న వారు ఎంతమంది.. తిరస్కరణకు గురైన దరఖాస్తులు ఎన్ని.. అనే పూర్తి చిత్రంపై స్పష్టత రానుంది.

కొత్తగా ఓటర్ల నమోదు దరఖాస్తులు ఇలా

6,750

మహబూబాబాద్‌

భూపాలపల్లి

4,096

ములుగు

హనుమకొండ

జనగామ

1,966

1,585

1,214

ఉమ్మడి వరంగల్‌లో

62,500 దరఖాస్తులు

కొత్త ఓటర్ల నమోదుకు 24,832..

పేర్ల సవరణకు 35,425

తొలగింపునకు 2,100 దరఖాస్తులు.. 962 పేర్లు తొలగింపు

అత్యధికంగా వరంగల్‌లో

21 వేలకు పైగా దరఖాస్తులు

పేర్ల తొలగింపు దరఖాస్తులో

హనుమకొండ జిల్లా ముందంజ..

పేర్ల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో హనుమకొండ జిల్లా ముందుంది. ఇక్కడ 1,281 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 558 పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను సరిచేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లో 35,425 దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం. వీటిలో 5,811 దరఖాస్తులపై సవరణలు పూర్తయ్యాయి. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉమ్మడి జిల్లాలో 24,832 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 457 దరఖాస్తుల వివరాలు ఓటర్ల జాబితాలో నవీకరించారు.

నియోజకవర్గం కొత్త తొలగింపు వివరాల

ఓటర్లు సవరణ

వరంగల్‌ పశ్చిమ 5,564 866 6,723

పరకాల 1,186 415 1,835

నర్సంపేట 1,291 21 1,532

వరంగల్‌ తూర్పు 5,001 182 7,126

వర్ధన్నపేట 2,929 116 3,305

జనగామ 1,453 47 3,046

స్టేషన్‌ఘన్‌పూర్‌ 1,429 38 2,362

పాలకుర్తి 1,214 13 2,132

డోర్నకల్‌ 836 14 1,392

మహబూబాబాద్‌ 1,130 37 1,993

భూపాలపల్లి 1,585 261 2,004

ములుగు 1,214 90 1,975

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement