11నుంచి శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

11నుంచి శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు

Oct 9 2026 1:32 AM | Updated on Oct 9 2026 1:32 AM

11నుంచి శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ఎంజీఎంలో రెండు నెలలుగా సీబీపీ టెస్ట్‌లు బంద్‌ సిబ్బంది పనితీరుతోనే పోలీస్‌శాఖ ప్రతిష్ట : సీపీ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజీనామా?

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21 వరకు శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాల వితరణ, సాయంత్రం 5నుంచి రాత్రి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 17వతేదీ అమ్మవారికి రథోత్సవం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.కోటి వ్యయంతో దారుమయ (టేకు) రథాన్ని దారుశిల్పులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ప్రాతఃకాల పూజలు, అర్చనలు, వివిధ క్రమాలలో అమ్మవారిని అలంకరించి విశేషసేవలు నిర్వహిస్తామని తెలిపారు.

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో గత రెండునెలల నుంచి సీబీపీ టెస్ట్‌లు బంద్‌ కావడంతో రోగులు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆఽశ్రయిస్తున్నారు. అదేవిధంగా ఆర్‌ఎఫ్‌టీ, ఎస్‌ఎల్‌ఈ, ఈస్‌ఆర్‌ టెస్ట్‌లు కూడా చేయకపోవడంతో రోగులు గత్యంతరం లేక ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లక తప్పడం లేదు. ఇదే క్రమంలో థైరాయిడ్‌తో పాటు ఇంకా కొన్నిరకాల పరీక్ష ష్యాంపిల్స్‌ తీసుకుని హనుమకొండలోని టీడయాగ్నొస్టిక్‌ సెంటర్‌కు పరీక్షల కోసం పంపితే అక్కడినుంచి రిపోర్టులు రావడంతో ఆలస్యం కావడంతో పేషంట్లకు చికిత్స సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఈ రిపోర్టుల కోసం సదరు పేషంట్లు రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. నిరుపేదలే ఎక్కువగా ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. అలాంటి వారికి డబ్బులు పెట్టి ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవడం భారంగా మారింది. అధికారులు అన్ని రకాల పరీక్షలు ఇక్కడే చేయించి, సకాలంలో రిపోర్టులు ఇప్పించాలని కోరుతున్నారు.

హన్మకొండ చౌరస్తా: పోలీస్‌ శాఖ ప్రతిష్ట గస్తీ విధులు నిర్వహించే సిబ్బంది పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసులు, స్టేషన్‌ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రతీ సిబ్బంది తమకు అప్పగించిన విధులను అంకితభావం, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హితవు పలికారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, ఎస్సై సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్‌తో ఓ విద్యార్థి వాగ్వాదం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ టి.మనోహర్‌ తన పదవికి గురువారం రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీపీగెట్‌–2026 ద్వారా పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సీట్లు లభించిన అభ్యర్థులు ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో రిపోర్టు చేస్తున్నారు. గురువారం ఓ విద్యార్థి.. ప్రిన్సిపాల్‌ మనోహర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. దీంతో మనస్తాపానికి గురైన మనోహర్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వర్తించబోనని రిజిస్ట్రార్‌ రామచంద్రాన్ని కలిసి రాజీనామా లేఖ అందజేసినట్లు తెలిసింది. గొడవ ఎందుకు జరిగిందనే విషయం కూడా వివరంగా తెలిపినట్లు సమాచారం. ఆయన రాజీనా మా ను అఽధికారులు ఆమోదిస్తారా లేక నచ్చజెప్పి కొనసాగిస్తారా అనేది ఒకటిరెండు రోజుల్లో తెలియనుంది. అడ్మిషన్లు జరుగుతున్న కీలక సమయంలో రాజీనామా నిర్ణయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement