వరంగల్ చౌరస్తా: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ఆందోళన చేస్తున్న రాహుల్గాంధీని అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటు చోరీ, రాహుల్ అరెస్ట్ను నిరసిస్తూ కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ చౌరస్తా నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. పోచంమైదాన్ జంక్షన్లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్లు జారతి రమేష్ కత్తెరశాల వేణుగోపాల్, ఎండీ ఫుర్కాన్, వస్కుల బాబు, బస్వరాజు కుమార్, బాలినే సురేష్, చింతాకుల అనిల్, ఎలగం లీలావతి సత్యనారాయణ, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, పల్లం పద్మ, కావేటి కవిత భోగి సువర్ణ సురేష్, బత్తిని వసుంధర, నాగపురి కల్పన సంజయ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొండా సురేఖ


