లో ఓల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లో ఓల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Oct 9 2026 1:32 AM | Updated on Oct 9 2026 1:32 AM

● ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

● భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలోని

సబ్‌స్టేషన్ల పరిశీలన

భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరాఫరా చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరణ్‌ రెడ్డి అన్నారు. గురువారం భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలోని 132/33 కేవీ, 33/11కేవీ సబ్‌స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. విద్యుత్‌ సరఫరా తీరు, సబ్‌ స్టేషన్‌లోని పరికరాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎండీ వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ రెండు మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న లో ఓల్టేజీ, ఓల్టేజీ హెచ్చుతగ్గుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. లో ఓల్టేజీ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి లోడ్‌ బ్యాలెన్సింగ్‌ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్లపై లోడ్‌ పర్యవేక్షణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. సబ్‌ స్టేషన్‌లోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్ల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంచాలని, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉంటూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సామ్యానాయక్‌, ఏఈడీ వంశీ, ఏఈ సుధాకర్‌, లైన్‌మెన్‌ సంజీవ్‌, సంబంధిత ఏఈలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement