సర్టిఫికెట్ల కోసం ఫీజులు చెల్లించేందుకు ‘పే నౌ’పై క్లిక్ చేస్తే ‘‘ఆర్డర్ అమౌంట్ లెస్ దన్ మినిమమ్ అమౌంట్ అలవుడ్’’ అనే సందేశం కనిపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చెల్లింపులు పూర్తికావడం లేదు. మరోవైపు దరఖాస్తుల స్టేటస్ మారకపోవడంతోనే ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చెల్లింపు చేయాల్సిన విద్యార్థికి పేమెంట్ గేట్వే పనిచేయకపోతే...ఆ లోపానికి విద్యార్థి ఎందుకు మూల్యం చెల్లించా లి? సాంకేతిక సమస్యను యూనివర్సిటీ గుర్తించి సరిచేసే వ్యవస్థ ఉందా? ‘పెండింగ్’ దరఖా స్తులను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారా? అత్యవసరంగా సర్టిఫికెట్ కావాల్సిన వి ద్యార్థికి ప్రత్యామ్నాయ మార్గం చూపుతున్నారా? అన్న దానిపై సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


