– 8లోu
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
‘పే నౌ’ నొక్కినా.. నో పేమెంట్!
సాక్షి, వరంగల్: వైద్య విద్యలో ఒక్కో సర్టిఫికెట్ విద్యార్థి భవిష్యత్‌కు కీలకమైన పత్రం. చదువు పూర్తయిన తర్వాత మరో యూనివర్సిటీలో చేరాలన్నా.. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా.. విదేశీ విద్యకు దరఖాస్తు చేయాలన్నా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నా మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ ధ్రువపత్రాలు అవసరం. అలాంటి పత్రాలను సకాలంలో అందించాల్సిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆన్లైన్ సర్టిఫికెట్ సేవల్లో సాంకేతిక సమస్యలు విద్యార్థులకు తలనొప్పిగా మారుతున్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో.. ‘పే నౌ’ అని చూపిస్తున్నా చెల్లింపు మాత్రం పూర్తి కాకపోవడంతో సర్టిఫికెట్ ప్రక్రియ అక్కడే నిలిచిపోతోంది. దీంతో దూరప్రాంతాల విద్యార్థులు ఆన్్లైన్ కావడం లేదని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులతోపాటు, కెరీర్ ఏమైపోతుందోనన్న మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
రూ.0గా చూపుతున్న చార్జీ.. అసలు ఫీజెంత?
విద్యార్థులు సమర్పించిన మరో రిక్వెస్ట్ డాక్యుమెంట్లో టోటల్ చార్జ్ రూ.0గా కనిపిస్తోంది. పేమెంట్ ట్రాన్సాక్షన్న్ నంబర్లు కూడా నమోదు కావడంలేదు. యూనివర్సిటీకి సంబంధించిన 2026 నోటిఫికేషన్లలో మాత్రం ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికెట్ ఫీజు రూ.2వేలుగా, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజుకు రూ.500లుగా అధికారులు పేర్కొన్నారు. కోర్సు, సర్టిఫికెట్, దరఖాస్తును బట్టి ఫీజు మారవచ్చు. అసలు ఫీజు చెల్లించాల్సిన చోట ‘రూ.0’గా ఆర్డర్ అమౌంట్ ఏర్పడితేనే ‘మినిమమ్ అమౌంట్’ ఎర్రర్ వస్తుందా? పేమెంట్ గేట్‌వేలో సమస్యా? లేక సర్టిఫికెట్ మాడ్యూల్లో ఫీజు మ్యాపింగ్ లోపమా? ఇది అధికారులు తేల్చాల్సిన సాంకేతిక అంశమనే వాదన వినిపిస్తోంది. దీనిపై వర్సిటీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందనే డిమాండ్ విద్యార్థుల నుంచి వినిపిస్తోంది.
హెల్ప్‌డెస్క్ ఉన్నా అంతంతే..
వర్సిటీ పరిధిలో 23,500మందికిపైగా విద్యార్థులున్నారు. వీరి కోసం మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ గైడ్, సర్టిఫికెట్ దరఖాస్తు సేవలు, ఆన్్లైన్ పేమెంట్ ప్రక్రియకు మార్గదర్శకాలను కూడా యూనివర్సిటీ అందుబాటులో ఉంచింది. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక్కో సర్టిఫికెట్ దరఖాస్తు ఎక్కడ ఆగిపోయిందో గుర్తించే ‘ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్’ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోంది? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. హెల్ప్‌డెస్క్ నంబర్లకు ఫోన్ చేసినా సాంకేతిక బృందం పరిశీలిస్తోందనే కాలయాపన సమాధానాలే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ మెయిల్ ఉన్నా విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆయా సాంకేతిక సమస్యలపై మాట్లాడేందుకు వర్సిటీ అధికారులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
బయోటెక్నాలజీ కీలకం
బయోటెక్నాలజీ రంగం భవిష్యత్‌లో మానవాళి మనుగడలో కీలకంగా మారనుందని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు.
కాళోజీ వర్సిటీలో మైగ్రేషన్, ట్రాన్స్క్రిప్ట్ దరఖాస్తులు
పెండింగ్‌లోనే..
రూ.0గా చూపిస్తున్న ఆర్డర్ అమౌంట్.. ‘మినిమమ్ అమౌంట్’ ఎర్రర్
నెలల తరబడి సర్టిఫికెట్ల కోసం
విద్యార్థుల ఎదురుచూపులు,
సాంకేతిక లోపంతో తిప్పలు
వర్సిటీ అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని విజ్ఞప్తి
బీడీఎస్ విద్యార్థిని లావణ్య 2026, ఆగస్టు 24న సాయంత్రం 4.34 గంటలకు మైగ్రేషన్ న్యూ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేశారు. పోర్టల్‌లో అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ 2026/29630గా నమోదైంది. ఒక కాపీ కావాలని పేర్కొన్నారు. అక్టోబర్ 5 నాటికీ ఈ దరఖాస్తు పెండింగ్గానే ఉంది. పేమెంట్ స్టేటస్ అన్ పెయిడ్ గా కనిపిస్తోంది. అదేరోజూ ట్రాన్క్రిప్ట్ కోసం కూడా దరఖాస్తు చేశారు. దీనికి 2026/91314 అప్లికేషన్్ నంబర్ ఉంది. ఇది కూడా
పెండింగ్గానే ఉండటం గమనార్హం. అంటే దాదాపు 44 రోజులవుతుంది.


